తీవ్ర గాయం తరువాత తొలిసారి బయటకు.. రష్మిక లేటెస్ట్ లుక్ వైరల్!

టాలీవుడ్ అందాల నటి రష్మిక మందన్న తుంటి గాయం తర్వాత ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక.. తొలిసారి పబ్లిక్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

Update: 2026-08-24 08:12 GMT

టాలీవుడ్ అందాల నటి రష్మిక మందన్న తుంటి గాయం తర్వాత ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక.. తొలిసారి పబ్లిక్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు తన భర్త, సినీ నటుడు విజయ్ దేవరకొండతో కలిసి ఆమె హాజరయ్యారు. కలర్ కోడెడ్ బ్లాక్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించిన ఈ జంట పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మిక పూర్తిగా కోలుకున్నట్లేనని భావిస్తూ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..

గాయం తర్వాత గ్రాండ్ ఎంట్రీ :

'మైసా' సినిమా పాట షూటింగ్ సమయంలో రష్మికకు తీవ్రమైన తుంటి గాయం కావడం, వైద్యుల సూచనతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం తెలిసిందే. గాయం అయిన తర్వాత ఆమె బయటకు రావడం ఇదే తొలిసారి. నిశ్చితార్థ వేడుకలో బ్లాక్ కలర్ లెహంగాలో రష్మిక ఎంతో క్యూట్‌గా కనిపిస్తే, విజయ్ దేవరకొండ కూడా బ్లాక్ డ్రెస్‌లో గ్రాండ్‌గా కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మళ్లీ షూటింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం:

రష్మిక గాయం కారణంగా ఆమె నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాలు 'మైసా', 'రణబాలి' షూటింగ్ షెడ్యూల్స్ కొంతకాలం ఆలస్యమయ్యాయి. ఇక ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా, చిరునవ్వుతో బయటకు కనిపించడంతో ఆయా సినిమా యూనిట్లు ఎంతో హ్యాపీగా ఉన్నాయి. ఇక రష్మిక మునుపటిలా చురుగ్గా మళ్లీ సెట్‌కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని నిర్మాతలు, దర్శకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆసక్తి రేపుతున్న ‘రణబాలి’, ‘మైసా’:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పీరియాడికల్ చిత్రం ‘రణబాలి’పై భారీ అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక మరోవైపు గోండు గిరిజన నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రంలో రష్మిక గిరిజన యువతిగా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తుండటంతో అభిమానులలో విశేషమైన క్రేజ్ నెలకొంది.

అభిమానుల్లో ఎగిసిపడుతున్న ఉత్సాహం:

ఇక విజయ్, రష్మిక జంటగా ఒకే వేడుకలో సందడి చేయడంతో ఇద్దరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్లాక్ డ్రెస్‌లో ఇద్దరూ మెరిసిపోతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక రష్మిక త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో షూటింగ్ స్పాట్‌లో అడుగుపెట్టి తన సినిమాలతో మళ్లీ రచ్చ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గాయం నుంచి కోలుకుని మునుపటి గ్లామర్‌తో బయటకు వచ్చిన రష్మిక లుక్స్ నెట్టింట రికార్డు వ్యూస్ సాధిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను దాటుకుని మళ్లీ బిజీ కాబోతున్న ఈ కన్నడ పైకి నటి మరింత విజయవంతంగా దూసుకుపోవాలని ఆశిద్దాం.




Tags:    

Similar News