దీపికా ప‌దుకొణే దెబ్బ‌కి హీరోలే ఎగ్జిట్!

బాలీవుడ్ చిత్రం `కాక్ టెయిల్` ఎలాంటి విజ‌యం అందుకుందో తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ భారీ వ‌సూళ్ల‌ను సాధించింది.

Update: 2026-06-22 02:30 GMT

బాలీవుడ్ చిత్రం `కాక్ టెయిల్` ఎలాంటి విజ‌యం అందుకుందో తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. ముఖ్యంగా అప్ప‌టి యూత్ ని ఫిదా చేసిన చిత్ర‌మిది. ముఖ్యంగా చిత్రంలో దీపికా పదుకొణె పోషించిన వెరోనికా పాత్ర అమ్మ‌డి కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అయితే అదే పాత్ర కార‌ణ‌గా ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారు? అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అందులో న‌టించిన సైఫ్ అలీ ఖాన్ రివీల్ చేసారు.

ఇందులో హీరో (గౌతమ్) పాత్ర కోసం తొలుత సైఫ్ అలీ ఖాన్‌ను అనుకోలేదట. ఆ సమయంలో బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోలుగా దూసుకుపోతున్న రణబీర్ కపూర్ -ఇమ్రాన్ ఖాన్‌లను ఈ పాత్ర కోసం సంప్రదించారట. కథ విన్న తర్వాత ఇద్ద‌రు ప్రాజెక్ట్‌లో నటించడానికి నిరాకరించారు. రణబీర్, ఇమ్రాన్‌లు ఈ సినిమాను తిరస్కరిం చడానికి ప్రధాన కార‌ణం దీపికా పదుకొణె పోషించిన వెరోనికా పాత్రేనని సైఫ్ తెలిపారు. కథ మొత్తం ఆ మహిళా పాత్ర చుట్టూనే తిరుగుతుందని.. సినిమాలో హీరో కంటే ఆ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత.. స్క్రీన్ స్పేస్ ..అద్భుతమైన ఎమోషన్స్ పండించే అవకాశం ఉందని భావించారుట‌.

దీంతో మాట ఇచ్చి సినిమాలో న‌టించ‌డం కంటే ఛాన్స్ వ‌దులుకోవడ‌మే ఉత్త‌మ‌మ‌ని ఎగ్జిట్ అయిన‌ట్లు సైఫ్ తెలిపారు. యువ హీరోలు నో చెప్పడంతో ఆ పాత్రను వేరే ఎవరితోనైనా చేయించడం కంటే తానే స్వయంగా నటించాలని సినిమాకు నిర్మాత కూడా అయిన సైఫ్ అలీ ఖాన్ రంగంలోకి దిగారు. అప్పటికే సీనియర్ అయిన సైఫ్ కథలో హీరోయిన్ పాత్రకున్న ప్రాధాన్యతను గౌరవిస్తూ ఆ పాత్రను చేయడానికి అంగీకరించారు. సినిమా విడుదలయ్యాక సైఫ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ కథ ప్రకారం అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం దీపికా పదుకొణె పాత్రే కావడం విశేషం.

సినిమాలో పశ్చాత్తాపం, ప్రేమ, స్నేహం, మానసిక సంఘర్షణ వంటి విభిన్న భావోద్వేగాలను ఆమె అద్భుతంగా పండించింది. ఈ సినిమాతో దీపిక‌కు బాలీవుడ్ లో మంచి పేరొచ్చింది. న‌టిగా మ‌రింత బిజీ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా `కాక్ టెయిల్ 2` కూడా తెర‌కెక్కింది. ఇటీవ‌లే ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇందులో షాహిద్ క‌పూర్ ,చ కృతిస‌న‌న్, ర‌ష్మికా మంద‌న్నా న‌టించారు. కానీ ఈ సినిమా అనుకున్నంత‌గా స‌క్సెస్ అవ్వ‌వ‌లేదు.

Tags:    

Similar News