KA పాన్ ఇండియా మూవీ బిగ్‌ అప్‌డేట్‌..!

కిరణ్ అబ్బవరం మొదటి సారి పౌరాణిక పాత్రలో నటిస్తున్న కారణంగా ఆయన అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2026-10-13 07:00 GMT

కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్‌ స్టోరీ' సినిమా తర్వత 'రియాల్టీ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రియాల్టీ సినిమా గ్లిమ్స్‌ అందరి దృష్టిని ఆకర్షించాయి. అదే సమయంలో ట్రోల్స్ ను ఎదుర్కొంది. కిరణ్ అబ్బవరం సినిమాలు దాదాపు అన్ని ఏదో ఒక విషయంలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవడం కామన్‌గా మారింది. అదే ఆయనకు కలిసి వస్తుందని కూడా కొందరు అంటున్నారు. మొత్తానికి చెన్నై లవ్‌ స్టోరీ విజయం తర్వాత మరిన్ని సినిమాలను కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన సినిమా సినిమాకు కంటెంట్ విషయంలో క్వాలిటీ పెంచుతూ వస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పటికే 'ఇంద్రపుత్ర' అనే పౌరాణిక సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈతరం యంగ్‌ హీరోలు పౌరాణిక సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోవడం అరుదుగా చూస్తూ ఉంటాం. కిరణ్ అబ్బవరం కు ఆ ఛాన్స్ దక్కింది.

 

కాంతార సినిమాకు వర్క్‌ చేసిన...

కాంతార : చాప్టర్‌ 1 సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించి, ఆ సినిమా మేకింగ్‌లో కీలక పాత్ర పోషించిన శ్రీకాంత్‌ పుప్పాల దర్శకుడిగా 'ఇంద్రపుత్ర' సినిమాతో పరిచయం కాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను శ్రీకాంత్‌ పుప్పాల రెడీ చేస్తున్నాడట. ఈ పౌరాణిక మూవీలో కిరణ్‌ అబ్బవరంతో పాటు, భారీ స్టార్‌ కాస్ట్‌ను దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే సినిమాలోని అత్యంత కీలకమైన పాత్రకు గాను పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు ఉన్న రమ్యకృష్ణను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ రేంజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ ప్రేక్షకుల్లోనూ రమ్యకృష్ణకి మంచి గుర్తింపు ఉంది. అందుకే ఇంద్రపుత్ర సినిమాలో ఆమె నటించడం ద్వారా కచ్చితంగా అన్ని చోట్ల పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అవ్వచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కిరణ్ అబ్బవరం హీరోగా ఇంద్రపుత్ర...

కిరణ్ అబ్బవరం మొదటి సారి పౌరాణిక పాత్రలో నటిస్తున్న కారణంగా ఆయన అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌ నుంచి షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి కీర్తన్‌, ప్రేరణ అరోరాలు నిర్మిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో ఇంద్రపుత్ర సినిమా 15వ సినిమా కావడంతో ఆయన అభిమానులు సైతం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. కిరణ్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ సినిమా ఒక ఎత్తు అన్నట్లుగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇంత తక్కువ సమయంలోనే కిరణ్ అబ్బవరంకు ఇలాంటి ఒక భారీ పౌరాణిక ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం అనేది అరుదైన విషయంగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అయితే కిరణ్ అబ్బవరం ఏ మేరకు పౌరాణిక పాత్రకు సెట్‌ అవుతాడు అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

రమ్యకృష్ణ కీలక పాత్రలో...

లవ్‌, ఫ్యామిలీ, మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాల్లో కిరణ్ అబ్బవరంను ఇప్పటివరకు చూసిన ప్రేక్షకులు పౌరాణిక సినిమాలో, పౌరాణిక పాత్రలో చూడడానికి కచ్చితంగా ఆసక్తిగా ఉన్నారు. విభిన్నమైన శైలి, తనకంటూ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ ను కలిగిన కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాతో టాలీవుడ్‌లో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకుని, అభిమానుల సంఖ్య పెంచుకునే అవకాశాలు ఉన్నాయని యూనిట్‌ సభ్యులు, ఆయన సన్నిహితులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాతలు చెబుతున్నారు. కిరణ్‌ అబ్బవరంకు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇంద్రపుత్ర ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఏ స్థాయి హైప్‌ ను క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News