చరణ్ ఇంట్లో కృష్ణుడు-రాధ.. ఈ జన్మాష్టమి సో స్పెషల్
ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. చరణ్ కుటుంబం నుంచి ఇలాంటి పర్సనల్ మూమెంట్స్ చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి.
రామ్ చరణ్, ఉపాసన ఇంట్లో ఈసారి జన్మాష్టమి పండగ కాస్త స్పెషల్ గా జరిగింది. తమ చిన్నారులను కృష్ణుడు, రాధలా రెడీ చేసి ఇంట్లోనే పూజ చేశారు. పూజ గదిలో చరణ్, ఉపాసన కూర్చుని ఉండగా పిల్లలు మధ్యలో కనిపిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద ఈవెంట్‌లా కాకుండా ఇంట్లో జరిగే పండగలా సింపుల్‌గా ఉన్న ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. చరణ్ కుటుంబం నుంచి ఇలాంటి పర్సనల్ మూమెంట్స్ చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి.
ఈ ఏడాది జనవరిలో చరణ్, ఉపాసన కవలలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. అప్పటినుంచి పిల్లలకు సంబంధించిన విషయాలను ఇద్దరూ చాలా పరిమితంగానే షేర్ చేస్తున్నారు. ఇప్పుడు జన్మాష్టమి సందర్భంగా మాత్రం కృష్ణుడు, రాధ గెటప్స్‌లో పిల్లలతో కలిసి పూజ చేసిన ఫొటోను బయటకు తీసుకొచ్చారు. ఇంట్లో పండగ వాతావరణం ఎలా ఉందో ఒక్క ఫ్రేమ్‌లోనే కనిపిస్తోంది.
చరణ్, ఉపాసన పిల్లల విషయంలో మొదటి నుంచి ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. క్లిన్ కారాను కూడా చాలా కాలం మీడియా కెమెరాలకు దూరంగానే ఉంచారు. కవలలు పుట్టిన తర్వాత కూడా వెంటనే వారి ముఖాలను బయటకు చూపించలేదు. ఈ ఫొటోలోనూ పిల్లలు ఉన్నా, వాళ్లను కెమెరా ముందు ప్రత్యేకంగా పోజ్ చేయించలేదు. పండగ మూమెంట్‌ను మాత్రమే షేర్ చేశారు.
ఇటీవల చరణ్ ఇంట్లో పండగలు, పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాల షూటింగ్స్, ప్రమోషన్స్ మధ్యలో ఆయన వ్యక్తిగత జీవితం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించదు. అందుకే ఇలాంటి సందర్భాల్లో వచ్చే ఒక్క ఫొటో కూడా త్వరగా వైరల్ అవుతోంది. ఈసారి కూడా చరణ్ లుక్ కంటే, కృష్ణుడు రాధగా రెడీ అయిన చిన్నారులే ఫొటోలో హైలైట్ అయ్యారు.
ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం కొంత బ్రేక్‌లో ఉన్నారు. మణికట్టు సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘పెద్ది’ తర్వాత ఆయన చేయాల్సిన సుకుమార్ సినిమా ఇప్పటికే లైన్‌లో ఉంది. ‘రంగస్థలం’ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఉన్నాయి. అయితే చరణ్ పూర్తిగా కోలుకుని షూటింగ్‌కు ఫిట్ అయిన తర్వాతే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.