చిరు కోసం ఫ్యాన్స్‌.. రామ్ చరణ్‌ పలకరింపు

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ హడావిడి ఏ స్థాయిలో ఉందో సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

Update: 2026-08-22 10:47 GMT

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌ హడావిడి ఏ స్థాయిలో ఉందో సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీ పడ్డ విషయం తెల్సిందే. చిరంజీవి పుట్టిన రోజు అంటే అభిమానులకు ఒక పెద్ద పండుగ అనే విషయం తెల్సిందే. ఆ పండుగను సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఫ్యాన్స్‌ రకరకాలుగా వేడుకలు నిర్వహించారు. కొందరు మెగాస్టార్‌ చిరంజీవి ఇంటి వద్దకు వెళ్లారు. ప్రతి ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఉండే చిరంజీవి ఇంటికి భారీ ఎత్తున అభిమానులు వెళ్లడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అభిమానులను ఆ రోజు అదుపు చేయడం కాస్త కష్టమే అంటారు. నేడు సైతం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

చిరంజీవిని చూసేందుకు, డైరెక్ట్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వెళ్లిన అభిమానులను మెగా పవర్‌ స్టార్‌ కలవడం జరిగింది. రామ్‌ చరణ్ స్వయంగా ఫ్యాన్స్ వద్దకు వెళ్లి వారికి అభివాదం చేశాడు. కారులో అభిమానులకు రూప్‌ టాప్‌ నుంచి అభివాదం చేయడం ద్వారా అక్కడ ఉన్న వారందరినీ చరణ్‌ సర్‌ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలే రామ్‌ చరణ్‌ కి ఆపరేషన్‌ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉన్న చరణ్‌ ఫ్యాన్స్ కోసం ఇలా బయటకు రావడం అభినందనీయం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రామ్‌ చరణ్‌ ను కలిసే అవకాశం దక్కిందంటూ అక్కడకు వెళ్లిన అభిమానులు, సినీ జనాలు ఇంకా కొందరు మీడియా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ మూవీ...

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం పూర్తి విశ్రాంతి మూడ్‌లో ఉన్న విషయం తెల్సిందే. పెద్ది సినిమా తో సూపర్‌ హిట్‌ అందుకున్న రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాను ఇప్పటికే సుకుమార్‌ దర్శకత్వంలో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం సుకుమార్‌ సైతం స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు వీరి కాంబో మూవీ పట్టాలు ఎక్కడం ఖాయం అని మెగా కాంపౌండ్‌ నుంచి సమాచారం అందుతోంది. పుష్ప వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ తర్వాత సుకుమార్‌ నుంచి రాబోతున్న సినిమా కావడంతో పాన్ ఇండియా రేంజ్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో ఇప్పటికే రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా చరణ్‌ కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్స్‌ లో ఒకటి అనడంలో సందేహం లేదు. అందుకే మళ్లీ వీరి కాంబో అనగానే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

చిరంజీవి కాకా మూవీ సంక్రాంతికి...

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన నటించిన విశ్వంభర సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వంభర విడుదల విషయమై క్లారిటీ లేదు, కానీ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు 'కాకా' అంటూ బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు, టైటిల్‌ గ్లిమ్స్‌ ను సైతం విడుదల చేయడం జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్‌ కి పెద్ద బర్త్‌డే గిఫ్ట్‌ దక్కినట్లు అయింది. బాబీ దర్శకత్వంలో ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమాను చేసిన చిరంజీవి ఇప్పుడు మరో హిట్‌ ను అందుకోవడం ఖాయం అనే నమ్మకం ను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి 2027 కి కాకా సినిమా రాబోతుంది. ఈ సినిమాలో చిరు డ్యూయెల్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.



Tags:    

Similar News