RC17 హీరోయిన్ రేసులో సారా ఎంట్రీ!
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రంగస్థలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో కథ, టెక్నికల్ అంశాలతో పాటు కాస్టింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఇప్పటివరకు పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రావడం డిస్కషన్‌కు దారితీస్తోంది. తాజాగా ధురంధర్‌తో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ పేరు బలంగా వినిపిస్తుండటంతో అసలు హీరోయిన్ ఎంపిక వెనుక సుకుమార్ ఆలోచన ఏంటనే ప్రశ్న మొదలైంది.
ఇప్పటివరకు RC17 హీరోయిన్‌గా కియారా అద్వానీ, రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ వంటి పేర్లు వినిపించాయి. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మార్కెట్, ఇమేజ్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. కియారా అద్వానీకి అయితే రామ్‌చరణ్‌తో ఇప్పటికే వర్క్ చేసిన ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంది. రష్మికకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. రుక్మిణి వసంత్ కూడా యాక్టింగ్ కు ప్రాధాన్యమున్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా సారా పేరు తెరపైకి రావడం ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
అయితే సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ ఎంపికను కేవలం స్టార్ ఇమేజ్, గ్లామర్ కోణంలోనే చూడటం కష్టం. ఆయన కథల్లో హీరోయిన్ క్యారెక్టర్ కు కథతో సంబంధం ఉండటంతో పాటు భావోద్వేగ పరమైన ప్రాధాన్యత కూడా కనిపిస్తుంటుంది. ఆర్య, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలను గమనిస్తే హీరో జర్నీలో హీరోయిన్ క్యారెక్టర్ కు ప్రత్యేక స్థానం ఉండటం గమనించొచ్చు. అందుకే RC17లో కూడా హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు మించి.. ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారుతోంది.
ఈ లెక్కన చూస్తే సారా అర్జున్ పేరు వినిపించడం వెనుక కొత్త జోడీపై ఆసక్తి మాత్రమే కాకుండా, పాత్రకు అవసరమైన యాక్టింగ్ ను పరిగణనలోకి తీసుకున్నారా అనే డిస్కషన్ కూడా మొదలైంది. రామ్‌చరణ్- సారా అర్జున్.. ఇప్పటివరకు కనిపించని కొత్త పెయిరింగ్ కావడం ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్ గా మారొచ్చు. ధురంధర్ తర్వాత సారాకు వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకుంటే, ఈ కాంబినేషన్ సినిమాకు నెక్ట్స్ లెవెల్ క్యూరియాసిటీని తీసుకురాగలదు.
అయితే ఈ సినిమాలో ప్రస్తుతం హీరోయిన్ ఎంపికపై వినిపిస్తున్నవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్సే. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు సారా పేరు ఖరారైందని చెప్పడం తొందరపాటే అవుతుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. RC17లో హీరోయిన్ సెలెక్షన్ రెగ్యులర్ కాస్టింగ్ డెసిషన్ కంటే ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరకు సుకుమార్ ఎవరిని ఎంచుకుంటారు? దాని వెనుక కథకు సంబంధించిన అసలు లెక్క ఏంటి? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.