హల్లల్లాలో హల్లో.. థియేటర్లలో మాస్ యాంథమ్ అవుతుందా?
పెద్ది నుంచి ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రైరైరా రయ్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేసి పాన్ ఇండియా స్థాయిలో భారీ రీచ్ తెచ్చుకున్నాయి.
పెద్ది నుంచి ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రైరైరా రయ్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేసి పాన్ ఇండియా స్థాయిలో భారీ రీచ్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ స్టెప్పులు, తమన్ బీట్‌లు, మాస్ విజువల్స్ కలిసి ఈ రెండు సాంగ్స్‌ను ఛార్ట్‌బస్టర్స్‌గా నిలబెట్టాయి. అయితే తాజాగా విడుదలైన హల్లల్లాలో హల్లో మాత్రం మొదటి సారి విన్నప్పుడు మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. భోపాల్‌లో జరిగిన భారీ ఈవెంట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసిన ఈ పాటను మేకర్స్ లిరికల్ రూపంలో కాకుండా డైరెక్ట్ వీడియో సాంగ్‌గా విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.
సాంగ్ మొదట్లో రామ్ చరణ్- శృతి హాసన్ జంట మధ్య వచ్చే మాస్ వైబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, మధ్యలో జాన్వీ కపూర్ ఎంట్రీతో పాటకు మరో ఫ్లేవర్ వచ్చింది. ముఖ్యంగా గ్లామర్ టచ్, విజువల్ స్టైలింగ్, గ్రాండ్ సెట్స్ ఈ సాంగ్‌ను పూర్తిగా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్టే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన తొలి రియాక్షన్స్ చూస్తే స్టెప్పులు బాగున్నాయి… కానీ సాంగ్ పూర్తిగా వైరల్ అయ్యే రేంజ్‌లో ఉందా? అన్న డిస్కషన్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా రైరైరా రయ్ లాంటి హుక్ ఇంపాక్ట్ ఇందులో మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో చాలా మంది అభిమానులు ఒక ఆసక్తికరమైన పోలికను గుర్తు చేస్తున్నారు.
రంగస్థలంలోని జిగేలు రాణి సాంగ్ కూడా రిలీజ్ టైమ్ లో యూనానిమస్ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోలేదు. కానీ థియేటర్లలో పూర్తి స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఆ పాట మాస్ యాంథమ్‌గా మారిపోయింది. అలాగే ఊ అంటావా సాంగ్ కూడా మొదట మిక్స్డ్ రెస్పాన్స్ ఎదుర్కొన్నప్పటికీ తర్వాత దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇప్పుడు హల్లల్లాలో హల్లో విషయంలో కూడా అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా థియేటర్లలో ఫుల్ సౌండ్, భారీ విజువల్స్, ముగ్గురు స్టార్స్ ఎనర్జీ కలిసి వేరే లెవెల్ మాస్ ఫీలింగ్స్ ఇస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ఈ సాంగ్ లో మరో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది ఎవడు తర్వాత రామ్ చరణ్- శృతి మళ్లీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. వారి కెమిస్ట్రీలో కనిపిస్తున్న నాస్టాల్జియా ఫ్యాక్టర్ మాస్ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ చేస్తోంది. మరోవైపు స్పెషల్ సాంగ్ లో జాన్వీ కపూర్‌ను జోడించడం ద్వారా నార్త్ మార్కెట్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. భోపాల్ ఈవెంట్ నిర్వహణ కూడా అదే వ్యూహంలో భాగమనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు సినిమా ప్రమోషన్స్‌ను హిందీ బెల్ట్‌లో అగ్రెసివ్‌గా తీసుకెళ్లే కొత్త స్ట్రాటజీగా దీన్ని చూస్తున్నారు.
దాదాపు మూడు గంటల పది నిమిషాల నిడివి ఉన్న సినిమాలో డైరెక్టర్ బుచ్చిబాబు సాన కేవలం నాలుగు పాటలకే పరిమితం కావడం కూడా చర్చనీయాంశమైంది. ఇది కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌కు సంకేతమా అనే చర్చ జరుగుతోంది. కమర్షియల్ సినిమాల్లో సాంగ్స్ కౌంట్ తగ్గించి కథనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇటీవలి ట్రెండ్‌గా మారుతున్న నేపథ్యంలో పెద్ది కూడా అదే దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ డ్యాన్స్ మూవ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్ రీల్స్, హుక్ స్టెప్స్, షార్ట్ వీడియోలు వరుసగా ట్రెండ్ అవుతున్నప్పటికీ.. చికిరి చికిరి, రైరైరా రయ్ స్థాయి సంచలనాన్ని హల్లల్లాలో హల్లో సృష్టిస్తుందా లేదా అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే తేలనుంది. థియేటర్లలో ఈ సాంగ్ కు వచ్చే మాస్ రెస్పాన్స్‌పై ఇప్పుడు అందరి చూపు పడింది.