పెద్ది.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..
విడుదలకు ముందే ఓ రేంజ్ లో బజ్ తీసుకురావాలని భావించిన మూవీ టీమ్, పెద్ది పవర్ ప్లే టూర్ పేరుతో ఇండియా వైడ్ గా ప్రమోషనల్ క్యాంపెయిన్ కు సిద్ధమైంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. విడుదలకు ముందే ఓ రేంజ్ లో బజ్ తీసుకురావాలని భావించిన మూవీ టీమ్, పెద్ది పవర్ ప్లే టూర్ పేరుతో ఇండియా వైడ్ గా ప్రమోషనల్ క్యాంపెయిన్ కు సిద్ధమైంది. ఫ్యాన్స్ లో సినిమా మీద ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఆ టూర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, చరణ్ లుక్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రామ్ చరణ్ క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారనే విషయం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ఇప్పుడు అదే క్రేజ్ ను మరింత పెంచడానికి మూవీ టీమ్ ప్రమోషన్స్ వైపు అడుగులు వేస్తోంది. ఆ టూర్ మే 18న ముంబైలో ప్రారంభం కానుంది. అక్కడే సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.
ఆ తర్వాత మే 22న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అదే రోజు ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుండటంతో స్టేడియంలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఉండనున్నారు. ఆ వేదికను యూజ్ చేసుకుని పెద్ది టీమ్ సినిమా ప్రమోషన్ ను మరింత గ్రాండ్ గా చేయాలని భావిస్తోంది.
ఇక టూర్ షెడ్యూల్ ను కూడా మూవీ టీమ్ ప్రత్యేకంగా ప్రకటించింది. ముంబై తర్వాత భోపాల్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, విజయనగరం, హైదరాబాద్ నగరాల్లో వరుసగా ఈవెంట్లు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మే 23న భోపాల్ లో స్పెషల్ సాంగ్ లాంచ్ ప్లాన్ చేయడం ఆసక్తికరంగా మారింది. నార్త్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేస్తూ టీమ్ ముందుకు వెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రమోషన్స్ అనౌన్స్ చేసే విధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'షెడ్యూల్ ప్రకటించకపోతే ఉరేసుకుంటా' అంటూ రీసెంట్ గా ఓ మెగా అభిమాని చేసిన పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ మూవీ టీమ్ టూర్ డేట్స్ ను వెల్లడించింది. దీంతో అభిమానులు కూడా స్ట్రాటజీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ది పవర్ ప్లే టూర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
సినిమా విడుదల తేదీని జూన్ 4గా ఫిక్స్ చేశారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఆకట్టుకునేలా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు భావోద్వేగాలకు సినిమాలో మంచి ప్రాధాన్యం ఉంటుందని టీమ్ చెబుతోంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రమోషన్స్ కు కొత్త ట్రెండ్ ఏర్పడుతోంది.
అయితే పెద్ది టీమ్ చేస్తున్న పవర్ ప్లే టూర్ మాత్రం స్పోర్ట్స్, సినిమా, ఫ్యాన్ కల్చర్ ను కలిపి మరింత పెద్ద రేంజ్ లో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా స్టేడియం ఈవెంట్లు, సిటీ టూర్స్, స్పెషల్ సాంగ్ లాంచెస్ సినిమాకు మరింత హైప్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు అభిమానులంతా ఒక్కటే ఎదురుచూస్తున్నారు.. ముంబై ఈవెంట్ లో విడుదలయ్యే ట్రైలర్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందోనని..