పెద్ది రిలీజ్.. ఫైనల్‌ గా సరైన డేట్ నే ఫిక్స్ చేశారా?

ఈ నేపథ్యంలో పెద్ది అదే సమయానికి రావడం కంటే ముందుగానే విడుదల చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.;

Update: 2026-05-01 08:18 GMT

మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఆ సినిమాపై రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆ మూవీ చివరికి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నది హాట్ టాపిక్‌ గా మారింది.

మొదటగా పెద్ది చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తేదీని వదిలి, ఏప్రిల్ 30వ తేదీన వాయిదా వేశారు. ఆ తర్వాత అప్పటికి కూడా సినిమా రెడీ కాకపోవడంతో జూన్ నెలకు రిలీజ్‌ ను మార్చారు. అలా తరచూ వాయిదాల వల్ల మెగా ఫ్యాన్స్ కొంత నిరాశకు గురవుతున్నారు. ఇటీవల పెద్ది సినిమా రిలీజ్ డేట్‌ పై దర్శకుడు బుచ్చిబాబు సాన చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడుతూ జూన్ 25న పెద్ది మూవీ విడుదలవుతుందని వెల్లడించారు. దీంతో అభిమానుల్లో కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ మారబోతుందనే కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, జూన్ 25వ తేదీకి బదులు జూన్ 4న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.

ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు ఆ విషయంపై సమాచారం అందించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే సమయంలో జూన్ 4న రావాల్సిన మరో భారీ సినిమా టాక్సిక్ వాయిదా పడడంతో, ఆ తేదీని క్యాష్ చేసుకోవాలన్న ప్లాన్‌ లో పెద్ది టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అక్కినేని అఖిల్ నటిస్తున్న లెనిన్ చిత్రం జూన్ 26న విడుదలవుతుందని మేకర్స్ మళ్లీ క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పెద్ది అదే సమయానికి రావడం కంటే ముందుగానే విడుదల చేస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పెద్ద సినిమాల మధ్య పోటీ తగ్గించుకోవడమే కాకుండా, సోలో రిలీజ్ ద్వారా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, జూన్ 12 వరకు విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ఉండటం. ఆ సమయంలో సినిమాలు విడుదలైతే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి.

అందుకే జూన్ 4ను సరైన తేదీగా మేకర్స్ ఫిక్స్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనిపించడం కాదు.. ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, నేడు జరిగే ప్రెస్ మీట్‌ లో రిలీజ్ డేట్‌ పై మేకర్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తరచూ వాయిదాల తర్వాత పెద్ది నిజంగా ఫైనల్ డేట్‌ ను పట్టుకుంటుందా? లేక మళ్లీ మార్పులు ఉంటాయా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News