పెద్ది జాన్వీ.. ఊళ్లో అమ్మాయిలు ఇలా ఉంటారా?
‘పెద్ది’ ట్రైలర్ చూసిన తర్వాత జాన్వీ కపూర్ రోల్ మీద చర్చ మొదలైంది. బుచ్చిబాబు ఆమెకు మాస్ క్యారెక్టర్ ఇచ్చాడని ముందే హింట్ ఇచ్చాడు.
‘పెద్ది’ ట్రైలర్ చూసిన తర్వాత జాన్వీ కపూర్ రోల్ మీద చర్చ మొదలైంది. బుచ్చిబాబు ఆమెకు మాస్ క్యారెక్టర్ ఇచ్చాడని ముందే హింట్ ఇచ్చాడు. ట్రైలర్‌లో కనిపించిన షాట్స్, పోస్టర్స్ చూస్తే పాటలు, గ్లామర్ షాట్స్, హీరో పక్కన డాన్స్ చేసే రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌లాగే ఉంది. 1980 బ్యాక్‌డ్రాప్, విజయనగరం ఊరు అని చెబుతున్నా, ఆమె కాస్ట్యూమ్స్, వోని తీసి విసిరేయడం చూసి “ఊళ్లో అమ్మాయిలు ఇలా ఉంటారా” అనే కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్స్ రియాక్షన్‌లో కొంత నిజం లేకపోలేదు.
బుచ్చిబాబు ట్రాక్ రికార్డ్ చూస్తే ఒక డౌట్ వస్తుంది. ‘ఉప్పెన’లో కృతి శెట్టి క్యారెక్టర్‌కి వెయిట్ ఇచ్చాడు. కథ మొత్తం ఆమె చుట్టూ తిరిగింది. లవ్ స్టోరీలో ఆమె డెసిషన్, ఎమోషన్ కీలకం అయ్యాయి. అయితే అదే బుచ్చిబాబు ఇప్పుడు ‘పెద్ది’లో జాన్వీని కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నాడా అనే అనుమానం ట్రైలర్ కలిగిస్తోంది. టీజర్, పోస్టర్స్‌లో రామ్ చరణ్ రగ్డ్ లుక్, యాక్షన్, డైలాగ్‌లే హైలైట్. జాన్వీ మాత్రం పాట బిట్‌లో, రెండు క్లోజప్స్‌లో కనిపించింది. స్టోరీలో ఆమె స్థానం ఏంటో క్లారిటీ లేదు.
ఇక్కడే ‘దేవర’ ఉదాహరణ గుర్తుచేసుకోవాలి. ఆ సినిమాలో జాన్వీ స్క్రీన్ టైమ్ తక్కువ. కథ మొత్తం ఎన్టీఆర్, సైఫ్ చుట్టూ తిరిగింది. అనిరుధ్ BGM, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్‌తో సినిమా నిలబడింది. జాన్వీ పాత్రని ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. రెండో తెలుగు సినిమా ‘పెద్ది’లో కూడా అదే రిపీట్ అయితే ఆమెకు లాభం ఉండదు. స్టార్ హీరో సినిమాలో గ్లామర్ రోల్ చేసి హిట్ కొడితే ఓకే. కానీ ఆ ఇమేజ్‌తోనే ఉంటే లాంగ్ రన్‌లో కష్టం.
‘పెద్ది’కి ఉన్న బలం రామ్ చరణ్, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు కాంబో. కంటెంట్ క్లిక్ అయితే కమర్షియల్ లెక్కల్లో సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అప్పుడు జాన్వీ గ్లామర్, డాన్స్ కూడా ప్లస్ అవుతాయి. కానీ ఒకవేళ కథ అటు ఇటూ అయితే, ఎమోషన్ కనెక్ట్ కాకపోతే మొదట బ్లేమ్ హీరోయిన్ మీదే పడుతుంది. “ఊరి కథకు ఈ గ్లామర్ ఏంటి” అనే టాక్ వస్తుంది. ఫైనల్‌గా చూస్తే జాన్వీకి ‘పెద్ది’ పెద్ద టెస్ట్. హిట్ అయితే కమర్షియల్ హీరోయిన్‌గా సెటిల్ అవుతుంది. ఇక కథలో ఆమెకు సరైన మార్క్ లేకపోతే, సినిమా తేడా కొడితే కెరీర్‌కి బ్రేక్ పడుతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే జూన్ 4 వరగు ఆగాల్సిందే.