కొత్త స్ట్రాటజీ: పెద్దినే కాదు.. ఆ సినిమాలు కూడా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాను కేవలం మాస్ ఎలివేషన్స్, ఫైట్లకే పరిమితం కాకుండా స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామాతో రూపొందించారని క్లియర్ గా తెలుస్తోంది. స్పోర్ట్స్ ద్వారా గ్రామ ప్రజలను ఒక్కటి చేయడం, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో తెరకెక్కించారని సమాచారం.
అదే ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల కొత్త స్ట్రాటజీగా మారినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కేవలం స్టార్ హీరో ఇమేజ్ తోనే సినిమాలు వర్కౌట్ అవ్వడం లేదు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. మంచి ఎమోషన్స్, హార్ట్ టచ్ చేసే కథలు ఉంటేనే సినిమాను ఆదరిస్తున్నారు. దీంతో దర్శకులు కూడా కొత్తగా ఆలోచిస్తూ మాస్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఎమోషన్స్ ను యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ పెరిగిన తర్వాత అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే యూనివర్సల్ ఎమోషన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదే ఇప్పుడు దర్శకుల మెయిన్ స్ట్రాటజీగా మారింది. అయితే పెద్దినే కాదు.. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల రాబోయే సినిమాలను గమనిస్తే ఇదే ట్రెండ్ క్లియర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 158 కూడా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోందని టాక్. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రంలో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. అయితే మెయిన్ స్టోరీ లైన్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అని తెలుస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య రిలేషన్ ను స్ట్రాంగ్ గా చూపించబోతున్నారట.
ఇక నందమూరి బాలకృష్ణ- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న NBK 112 కూడా ఇదే దారిలో వెళ్తోంది. కొరటాల శివ సినిమాల్లో సోషల్ మెసేజ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో తెలిసిందే. ఆ సినిమాలో కూడా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ తో పాటు గుండెల్ని తాకే ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేసినట్లు సమాచారం.
రవితేజ నటిస్తున్న ఇరుముడి సినిమా అయితే తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుందని వినికిడి. దర్శకుడు శివ నిర్వాణ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా డిజైన్ చేసినట్లు టాక్. ఒక తండ్రి తన కుమార్తె కోసం చేసే పోరాటం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సూర్య- వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తోనే తెరకెక్కుతోంది.
అలా ఇప్పుడు అనేక మంది దర్శకుల ఆలోచన పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు మాస్ ఎలిమెంట్స్ చాలు అనుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులు కంటెంట్ ను చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కనెక్ట్ కావడం లేదు. అందుకే దర్శకులు కూడా కమర్షియల్ ఫార్మాట్ లోనే హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ను యాడ్ చేస్తూ, ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేసే స్ట్రాటజీతో కథలను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.