పెద్ది సెన్సార్.. ఓపెనింగ్స్ కు ఇది సరిపోతుందా?

లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవడం సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.

Update: 2026-05-20 19:18 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'పెద్ది' సినిమా చుట్టూ ఇప్పుడు నెట్టింట పాజిటివ్ వైబ్రేషన్స్ నడుస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవడం సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. రన్ టైమ్ కూడా 3 గంటలు ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మీద బజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది.

మేకర్స్ కూడా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గకుండా చాలా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. ఇవన్నీ సినిమాకి ఒక సాలిడ్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక భారీ పాన్ ఇండియా సినిమాకు ఇలాంటి పాజిటివ్ అప్డేట్స్ అన్నీ మొదటి రోజు ఓపెనింగ్స్ తీసుకురావడానికి వాడే పదునైన ఆయుధాలు లాంటివి. సినిమా కంటెంట్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే, రిలీజ్ కు ముందు వచ్చే సెన్సార్ టాక్, ట్రైలర్ కట్ ఇంపాక్ట్, సాంగ్స్ హిట్ అవ్వడం.. ఇవన్నీ తొలిరోజు థియేటర్ల ముందు జనాన్ని క్యూ కట్టేలా చేస్తాయి.

రామ్ చరణ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కు తోడు బుచ్చిబాబు విలేజ్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ కావడంతో ఈ ప్రమోషనల్ ట్రిక్స్ అన్నీ ఓపెనింగ్స్ మీద గట్టిగానే ప్రభావం చూపించబోతున్నాయి. ఇక సెన్సార్ వాళ్ళు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఈ సినిమాకు దొరికిన అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లో రగ్గడ్ లుక్, రా యాక్షన్ సీన్స్ చూసి సినిమాకు కచ్చితంగా A సర్టిఫికెట్ వస్తుందేమో అని కొందరు ఊహించారు. కానీ ఈ సర్టిఫికేట్ తో ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు థియేటర్లకు రావడానికి లైన్ క్లియర్ అయిపోయింది.

వందల కోట్ల బడ్జెట్ తో తీసిన ఇలాంటి ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అవ్వాలంటే కేవలం మాస్ ఆడియన్స్ వస్తే సరిపోదు, ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవ్వాలి. ఆ కోణంలో ఈ సర్టిఫికెట్ కలెక్షన్స్ కు బాగా హెల్ప్ అవుతుంది. కానీ పాన్ ఇండియా సినిమాలకు అసలు పరీక్ష అంతా రిలీజ్ రోజు వచ్చే పబ్లిక్ టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్స్ ఎంత భారీగా వచ్చినా, మార్నింగ్ షో తర్వాత బయటకు వచ్చే మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటేనే ఆ వసూళ్లు వీకెండ్ దాటి లాంగ్ రన్ లో కంటిన్యూ అవుతాయి.

ఈ రోజుల్లో మార్కెట్ లో ఏమాత్రం తేడా కొట్టినా ఆడియన్స్ నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. కలెక్షన్స్ డ్రాప్ అవ్వడానికి పెద్దగా సమయం పట్టడం లేదు. అందుకే ఈ ఆయుధాలతో తెచ్చుకున్న ఓపెనింగ్స్ ను కంటెంట్ ఎంత బలంగా నిలబెట్టుకుంటుంది అన్నదే అత్యంత కీలకం. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ మాస్ సినిమా పడి చాలా రోజులవుతోంది. ఆ లోటును భర్తీ చేసేలా పెద్ది కంటెంట్ ఉంటే వసూళ్ల సునామీ గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ పాజిటివ్ బజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో జరిగే ఛాన్స్ ఉంది. కేవలం యాక్షన్ మీదే కాకుండా స్పోర్ట్స్ డ్రామాలో మంచి ఎమోషన్ వర్కవుట్ అయితే మాత్రం కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో నమోదు అవుతాయి. ఓపెనింగ్స్ రాబట్టడంలో ప్రాజెక్ట్ సక్సెస్ ట్రాక్ లోనే ముందుకు వెళ్తోంది. ఇక సెన్సార్ రిపోర్ట్స్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెంచడంలో సక్సెస్ అయిన మేకర్స్, ఇప్పుడు తొలిరోజు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్స్ అనేవి థియేటర్ లోకి జనాన్ని రప్పిస్తాయి, కానీ లోపల ఉన్న కంటెంట్ వాళ్ళను కూర్చోబెట్టాలి. జూన్ 4న థియేటర్లలో పడే అసలైన టాక్ ఈ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయబోతోంది.

Tags:    

Similar News