రామ్ చ‌ర‌ణ్ లో న‌మ్మ‌కాన్ని నింపిన స‌ల్మాన్-అమీర్ ఖాన్!

రామ్ చరణ్ నేడు గ్లోబ‌ల్ స్టార్. అత‌డిపై వంద‌ల కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది.

Update: 2026-05-19 09:52 GMT

రామ్ చరణ్ నేడు గ్లోబ‌ల్ స్టార్. అత‌డిపై వంద‌ల కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. తండ్రిని మించిన త‌న‌యుడిగా ఎదుగుతున్నాడు. క‌థ‌ల‌ప‌రంగా చ‌ర‌ణ్ లో ఎంతో మెచ్యుర్టీ వ‌చ్చిందిప్పుడు. ఒక‌ప్పుడు క‌మ‌ర్శియ‌ల్ క‌థ‌ల‌కే ఒటేసిన చ‌ర‌ణ్ ఇప్పుడు వైవిథ్య‌మైన కాన్సెప్ట్ లు త‌ప్ప రోటీన్ క‌థ‌ల‌కు ఒకే చెప్ప‌డం లేదు. ప్ర‌స్తుతం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `రంగ‌స్థ‌లం` త‌ర్వాత మ‌రో మట్టి వాస‌న క‌థ‌లో న‌టిస్తున్నాడ‌ని ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ తోనే తేలిపోయింది. అటుపై ఈ క‌థ‌కు క్రీడా నేప‌థ్యం కూడా ఉంద‌ని వెలుగులోకి వ‌చ్చింది.

తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ తో క్రీడ‌తో పాటు అంత‌కు మించి బ‌ల‌మైన ఎమోష‌న్ కూడా క‌థ‌లో ఉంద‌ని..స్టోరీలో చాలా పార్శ్వాలున్నాయ‌ని అర్ద‌మ‌వుతుంది. పాత్ర కోసం చ‌ర‌ణ్ మేకోవ‌ర్ అంత‌కంత‌కు హైప్ తీసుకొచ్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ మీట్ లో బాలీవుడ్ అగ్ర హీరోలైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లు తనపై చూపిన ప్రభావం గురించి చరణ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.`పెద్ది` సినిమా కథాంశం గ్రామీణ నేపథ్యం కలిగిన స్పోర్ట్స్ డ్రామా అని ఇలాంటి విలక్షణమైన పాత్రను అంగీకరించడానికి బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వెల్లడించారు.

అమీర్ ఖాన్ నటించిన `దంగల్`, సల్మాన్ ఖాన్ చిత్రం `సుల్తాన్` బాక్సాఫీస్ వద్ద సాధించిన భారీ విజయాలు, ఆ సినిమాల్లోని కంటెంట్ నటుడిగా తనలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయని చరణ్ కొనియాడారు.`దంగల్`, `సుల్తాన్` వంటి చిత్రాలు కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా ఒక క్రీడ చుట్టూ ఉండే భావోద్వేగాలను, కష్టాలను అద్భుతంగా ఆవిష్కరించాయి. ఉత్తరాది ప్రేక్షకులు ఆ చిత్రాలను అద్భుతంగా ఆదరించడం వల్లే తాను చేస్తున్న `పెద్ది` వంటి వైవిధ్యమైన సినిమాకు పక్కా మార్గం సుగమం అయిందని చరణ్ అభిప్రాయపడ్డారు.

రూటెడ్ -ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలకు ఇండియా అంతటా అద్భుతమైన మార్కెట్ ఉందని ఈ చిత్రాల విజయాలు నిరూపించాయని చ‌ర‌ణ్‌ పేర్కొన్నారు. ఉత్తర-దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య బంధం మరింత బలపడుతున్న తరుణంలో టాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ సినిమాల సక్సెస్ ఫార్ములాను - అక్కడి స్టార్ల ప్రదర్శనను ఓపెన్‌గా ప్రశంసించడం ఇండస్ట్రీలో హెల్తీ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది. మ‌ల్ల యోధులుగా సుల్తాన్ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్..దంగ‌ల్ చిత్రంలో అమీర్ ఖాన్ అసాధార‌ణ న‌ట‌న గురించి తెలిసిందే. ఆ చిత్రాల కోసం స్టార్ హీరోలిద్ద‌రు ఎంతో శ్ర‌మించారు. కుస్తీ పోటీ కోసం ఇద్ద‌రు స్టార్లు ప్ర‌త్య‌కంగా స‌న్న‌ద‌మై బ‌రిలోకి దిగారు. అందుకే పాత్ర‌ల మ‌ధ్య అంత స‌హ‌జ‌త్వం ఒట్టిప‌డింది. మ‌రి `దంగల్`, `సుల్తాన్` చిత్రాలు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కుతున్న `పెద్ది` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో చూడాలి.

Tags:    

Similar News