చరణ్ బాడీగార్డ్.. విలన్‌ని చేస్తారా ఏంటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాడు. చరణ్ పక్కన నీడలా నడుస్తున్న ఈ విదేశీ బాడీగార్డ్ కటౌట్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ ఫామ్స్ లో ఇతనికి ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే టాలీవుడ్ లో ఒక కొత్త విలన్ దొరికేసాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏ చిన్న వీడియో పెట్టినా లక్షల్లో లైక్స్ వస్తుండటం విశేషం.
రీసెంట్ గా జరిగిన పెద్ది ఈవెంట్ లో ఒక అభిమాని చరణ్ పైకి దూసుకురాబోగా, ఈ బాడీగార్డ్ అతన్ని సింగిల్ హ్యాండ్ తో ఎత్తి అవతలకు తీసుకెళ్లిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిమానుల ఆరాటాన్ని కంట్రోల్ చేయడంలో అతను చూపిస్తున్న డెడికేషన్ కి ఫ్యాన్స్ కూడా ముగ్ధులవుతున్నారు. ఇతని పర్సనాలిటీ చూస్తుంటే అసలు ఈ బాడీగార్డ్ కే ఇంకో బాడీగార్డ్ కావాలేమో అనే రేంజ్ లో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
గాంబియా దేశానికి చెందిన కెవిన్ కుంతా అనే ఈ ప్రొఫెషనల్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఫైటర్ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నాడు. రగ్గడ్ లుక్ తో ఉండే ఈ విదేశీ ఫైటర్ చరణ్ పక్కన నడుస్తుంటే చూడ్డానికి ఒక సినిమా విలన్ లాగా కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సాధారణ సెక్యూరిటీ గార్డులు జనాలను నెట్టేయగలరు కానీ అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలను ఊహించలేరు. అదే ఒక ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ ఫైటర్ అయితే వాళ్ళ రిఫ్లెక్స్ లు చాలా ఫాస్ట్ గా ఉంటాయి.
చరణ్ నటిస్తున్న 'పెద్ది' ఒక స్పోర్ట్స్ యాక్షన్ సినిమా కావడం, పబ్లిక్ లో భారీగా ప్రమోషన్స్ చేస్తుండటం వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ ప్లాన్ చేశారు. ఇక ఈ బాడీగార్డ్ విజువల్స్ సోషల్ మీడియాలో చూసిన సినిమా లవర్స్ ఊరుకోవడం లేదు. ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి రా, రస్టిక్ సినిమాల డైరెక్టర్లను ట్యాగ్ చేస్తూ ఇతన్ని విలన్ గా పెట్టుకోవాలని సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి పర్ఫెక్ట్ కటౌట్ ఉన్న వ్యక్తిని స్క్రీన్ పై విలన్ గా చూపిస్తే యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కామెంట్స్ బాక్స్ లు నింపేస్తున్నారు. నెటిజన్లు చూపిస్తున్న ఈ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో విలన్ క్యారెక్టర్స్ కి చాలా డిమాండ్ ఉంది. హీరోకు గట్టి పోటీ ఇచ్చే విలన్ ఉంటేనే సినిమా సక్సెస్ రేంజ్ పెరుగుతుంది. అందుకే రామ్ చరణ్ పక్కన ఉన్న ఈ కొత్త సెక్యూరిటీ గార్డ్ లో ఒక పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్ ను వెతుకుతున్నారు. ఇతని రగ్గడ్ లుక్స్ చూస్తే కచ్చితంగా యాక్షన్ సినిమాలకు సరిపోతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాలు ఇతన్ని విలన్ ను చేసేదాకా వదిలేలా లేరని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ నిజంగానే ఏ డైరెక్టర్ అయినా ఈ ఐడియాతో ముందుకొచ్చి ఛాన్స్ ఇస్తే ఇండస్ట్రీలో ఒక క్రేజీ యాక్టర్ ని చూడొచ్చు.