రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో.. లెహంగా లుక్‌తో నెటిజన్లు ఫిదా !

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సరికొత్త ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Update: 2026-07-08 08:13 GMT

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సరికొత్త ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. సౌత్ నుంచి నార్త్ దాకా అందరినీ తన యాక్టింగ్‌తో కట్టిపడేసిన ఈ క్రేజీ హీరోయిన్, తాజాగా నెవ్వర్ బిఫోర్ అనదగ్గ ట్రెడిషనల్ అవతారంలో మెరిసిపోయింది. ఒకప్పుడు సినిమాలతో వెండితెరను ఏలిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఎలా ఫిదా చేస్తుందో చూద్దాం.




 


రకుల్ ధరించిన డ్రెస్ విశేషాలు ఇవే:

"కలల చూపులు.. కాంతులు వెదజల్లే మనసు" అంటూ తాజా ఫొటోషూట్‌ ను అభిమానులతో పంచుకుంది..ఇక రకుల్ ట్రెడిషనల్ అండ్ మోడ్రన్ లుక్ కలగలిసిన లెహంగా లో మెరిసిపోయింది. ప్రముఖ డిజైనర్ 'సావన్ గాంధీ' డిజైన్ చేసిన ఓంబ్రే మెటాలిక్ సీక్విన్స్ లెహంగాను ఆమె ధరించింది. ఇక ఈ లెహంగా షేడ్స్ మారుతూ ఎంతో అందంగా కనిపిస్తోంది. దీనికి కాంబినేషన్‌గా డీప్ నెక్ ఎంబ్రాయిడరీ స్లీవ్‌లెస్ చోలీ బ్లౌజ్, బోర్డర్లలో చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్న మ్యాచింగ్ ట్యుల్లే సిల్క్ దుపట్టాను రకుల్ మ్యాచ్ చేసింది. ఇక ఈ డ్రెస్‌లో రకుల్ చాలా రాయల్‌గా కనిపిస్తోంది.




 


మోడలింగ్ నుండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ దాకా:

రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, 2009లో 'గిల్లి' అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో ఈమెకు సూపర్ బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత 'లౌక్యం', 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఇక 15 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో ఫిలింఫేర్ నామినేషన్లను కూడా దక్కించుకుంది.




 


బాలీవుడ్‌లో లక్.. పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు:

తెలుగులో కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రకుల్ బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 2014లో 'యారియాన్' సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత 'దే దే ప్యార్ దే', 'డాక్టర్ జి' వంటి సినిమాలతో అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'పతి పత్ని ఔర్ వో దో'తో పాటు కమల్ హాసన్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం 'ఇండియన్ 3' కూడా ఉంది.




 


రామాయణంలో 'శూర్పణఖ'గా సంచలనం:

ప్రస్తుతం సినిమాల స్పీడ్ కాస్త తగ్గించినప్పటికీ, రకుల్ ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో భాగమైంది. నితీష్ తివారి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమాలో రకుల్ 'శూర్పణఖ' అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది.




 


ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా రకుల్ ఎప్పుడూ తన ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. నిత్యం కొత్త కొత్త గ్లామర్ అండ్ ఫిట్‌నెస్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఖుషీ చేస్తోంది. ఇక ఈ లేటెస్ట్ మెటాలిక్ లెహంగా ఫొటోలు కూడా రకుల్ ఫ్యాషన్ సెన్స్‌కు అద్దం పడుతున్నాయి. మరి ఈ బ్యూటీ రాబోయే సినిమాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News