లేటెస్ట్ లుక్ తో అదరగొట్టిన రకుల్.. డ్రెస్ ఖరీదు ఎంతంటే?

2009లో గిల్లి అంటూ అనిత పాత్రతో కన్నడ అభిమానుల హృదయాలు దోచుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. 2011లో కెరటం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Update: 2026-06-03 07:30 GMT

2009లో గిల్లి అంటూ అనిత పాత్రతో కన్నడ అభిమానుల హృదయాలు దోచుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. 2011లో కెరటం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.కానీ 2013లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో ప్రార్థన అనే పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. సందీప్ కిషన్ హీరోగా మేళ్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్.." ప్రార్ధన ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ" అనే డైలాగ్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఈమెకు వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు తలుపు తట్టాయి.




 


అలా రఫ్, లౌక్యం, కరెంటు తీగ, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ ,విజేత, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్ ఇలా పలు తెలుగు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఈ కార్ తర్వాత కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి రావడంతో అవకాశాలు తగ్గాయి. అయినా సరే అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది ఈ ముద్దుగుమ్మ..




 


అలా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈమె.. మన్మధుడు 2 సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ 2021లో కొండపొలం అనే సినిమాలో ఓబులమ్మ పాత్రతో మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ బాలీవుడ్ కి పరిమితమై.. అక్కడే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మధ్య మధ్యలో తమిళ్ , తెలుగు అంటూ ప్రేక్షకులను పలకరించినా.. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారింది. అందులో భాగంగానే చివరిగా దేదే ప్యార్ దే 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. పతి పత్ని ఔర్ వో దో సినిమాలో నటించింది.




 


ప్రస్తుతం పౌరాణిక ఇతిహాసం బాలీవుడ్ రామాయణం చిత్రంలో రావణ సోదరిగా సూర్పనఖ పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులో భాగమైన ఈమె.. ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ట్రెండీ అవుట్ ఫిట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.. అందులో భాగంగానే తాజాగా మరో ఔట్ఫిట్ తో నెటిజన్స్ ముందుకొచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.




 


తాజాగా అరోకా రేవా డ్రెస్ ధరించింది. దీనికి స్ట్రక్చర్డ్ కార్సెట్ బాడీస్ అలాగే ప్రింటెడ్ మిడిల్ స్కర్ట్ కాంబినేషన్లో బ్లాక్ ప్రింటింగ్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ గౌన్ ధరించి తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె ధరించిన డ్రెస్ సింపుల్ గా కనిపించినా.. దాని ధర తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా ఈ అరోకా రేవా డ్రస్ అక్షరాల రూ.39,000. ప్రముఖ ఈ - కామర్స్ దిగ్గజ సైట్స్ లో అందుబాటులో ఉంది. ఈ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ వలకబోస్తూ లేటెస్ట్ ఫోటోషూట్ ని రకుల్ షేర్ చేయడంతో అభిమానులు ఈమె ఫోటోలు చూసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. గ్లామర్ బ్యూటీ అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది అమేజింగ్.. ఎప్పుడూ ప్రెట్టీ గా ఉంటుంది అంటూ ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకుంటున్నారు. రకుల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ అభిమానులను ఫిదా చేస్తోంది.

Tags:    

Similar News