దిల్ ఖుష్ అంటూ అభిమానులను ఖుషీ చేసిన రకుల్.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ చందమామ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తాజా ఫోటోలు పోస్ట్ చేసింది. అవి నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి.;

Update: 2026-05-07 15:30 GMT

టాలీవుడ్ చందమామ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తాజా ఫోటోలు పోస్ట్ చేసింది. అవి నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి. "ఆజ్ దిల్ షాయరానా హై" అంటూ ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వైట్ డ్రెస్సులో దేవకన్యలా మెరిసిపోతున్న రకుల్, తన అప్ కమింగ్ మూవీ 'పతి పత్ని ఔర్ వో 2' ప్రమోషన్లలో భాగంగా ఈ లుక్‌లో దర్శనమిచ్చారు. రకుల్ అందానికి నెటిజన్లు దిల్ ఖుష్ అయిపోతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఆ అదిరిపోయే ఫోటోషూట్ విశేషాలు మీకోసం..



 


దేవకన్యలా మెరిసిపోతున్న రకుల్:

రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె ఆస్ట్రేలియన్ లేబుల్ 'బార్డోట్' రూపొందించిన వైట్ హాల్టర్-నెక్ రుచ్డ్ గౌనులో కనిపించింది. ఈ డ్రెస్ రకుల్‌కు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చింది. ఈ ఫోటోలను చూస్తుంటే ఆమె ఏదో ఒక అందమైన కవితలా అనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ పిక్స్ షేర్ చేస్తూ రకుల్ పెట్టిన క్యాప్షన్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది.



 


ఆ స్పెషల్ డ్రెస్ విశేషాలేంటి?:

రకుల్ ధరించిన ఈ డ్రెస్ పేరు 'సోలానా మెష్ మాక్సీ డ్రెస్'. ఇది బాడీకి హత్తుకునేలా ఉండి, రకుల్ ఫిగర్‌ను మరింత అందంగా చూపిస్తోంది. ముఖ్యంగా మెడ దగ్గర ఒక ఎర్రటి గులాబీ ఆకారం ఉన్న డిజైన్ నేక్ కి సెట్ చేయడం హైలెట్‌గా నిలిచింది. దీనికి తోడు చేతికి ఉన్న స్టేట్‌మెంట్ రింగ్స్ ఆమె లుక్‌కు ఒక ప్రత్యేకమైన కళను తెచ్చాయి. తెల్లటి గౌనులో ఆ ఎర్ర గులాబీ మెరుపు రకుల్ అందాన్ని రెట్టింపు చేసింది.



 


ప్రమోషన్లలో 'పతి పత్ని ఔర్ వో 2' సందడి:

రకుల్ ఈ గ్లామరస్ ఫోటోషూట్ చేసింది ఊరికే కాదు సుమ ఇక తన రాబోయే సినిమా 'పతి పత్ని ఔర్ వో 2' ప్రమోషన్ల కోసం! మే 15న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆయుష్మాన్ ఖురానా, వామికా గబ్బి, సారా అలీ ఖాన్‌లతో కలిసి రకుల్ ఈ చిత్రంలో సందడి చేయనుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'హమ్నే వహీ లగాయా దిల్' అనే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.



 


కుర్రాళ్ల గుండెల్లో గంటలు కొట్టిస్తున్న గ్లామర్:

రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో రకుల్ లుక్స్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాటలో రకుల్ విజువల్ చార్మ్ అద్భుతంగా ఉంది. సినిమా ప్రమోషన్ల కోసం ఆమె ఎంచుకుంటున్న డ్రెస్సులు, చేస్తున్న ఫోటోషూట్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. 'దిల్ ఖుష్' అంటూ అభిమానులు రకుల్ పిక్స్‌ను వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసేసింది. 'పతి పత్ని ఔర్ వో 2' సినిమాతో రకుల్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూడాలి. ఇక మే 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు రకుల్ ఇచ్చే ఈ గ్లామర్ ట్రీట్ ను ఎంజాయ్ చేయాల్సిందే.

Tags:    

Similar News