రక్షాబంధన్ స్పెషల్.. తోబుట్టులతో సెలబ్రిటీస్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తోబుట్టువులు అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు, ఘట్టమనేని మంజుల.

Update: 2026-08-28 05:25 GMT

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలుగా కొనసాగుతున్నప్పటికీ.. రక్తసంబంధం వద్దకు వచ్చేసరికి వారంతా మామూలు మనుషులే.. ముఖ్యంగా మదర్స్ డే, ఫాదర్స్ డే ఎలా అయితే తమ తల్లిదండ్రులతో సెలబ్రేట్ చేసుకుంటారో.. ఇక రక్షాబంధన్ కూడా అంతకుమించి అనే చెప్పాలి. తోబుట్టులతో రక్షాబంధన్ జరుపుకుంటూ ఆ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు పేరుకే సినిమా సెలబ్రిటీలైనా.. తమ తోబుట్టువుల వద్దకు వచ్చేసరికి ఎప్పటిలాగే టామ్ అండ్ జెర్రీ రేంజ్ లో గొడవ పడుతూ.. ప్రాణ స్నేహితులుగా మారుతారు. ఏదైనా సరే ఓపెన్ గా షేర్ చేసుకునే ఏకైక మిత్రుడు తోబుట్టువు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సమయం వచ్చినప్పుడు ఆ ఆప్యాయతను బయటపెడుతూ ఉంటారు.. ఇకపోతే నేడు రక్షాబంధన్ కావడంతో ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తోబుట్టువులతో జరుపుకున్న రక్షాబంధన్ ఫోటోలను వారితో ఉన్న మమకారాన్ని పంచుకుంటున్నారు.

రక్షాబంధన్ స్పెషల్.. మహేష్ బాబుతో మంజుల స్పెషల్ పిక్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తోబుట్టువులు అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు మహేష్ బాబు, ఘట్టమనేని మంజుల. ఇద్దరూ సెలబ్రిటీలే అయినా సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఒకరితో ఒకరు అనుబంధాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నేడు రక్షాబంధన్ కావడంతో ఈ సందర్భంగా ఘట్టమనేని మంజుల తన సోదరుడు మహేష్ బాబుతో ఉన్న ఒక స్పెషల్ పిక్ ని షేర్ చేస్తూ.. ఒక సుదీర్ఘ పోస్టు పంచుకుంది. "మన తోబుట్టువులతో మనం పంచుకునే బంధంలో ఎంతో అమూల్యమైన విషయం ఉంది. మనం పుట్టినప్పటి నుండి మనలోని ప్రతి దశలో, ప్రతిరూపంలో వాళ్లకు మనం ఏంటో తెలుసు.. మనం మంచిగా ఉన్నప్పుడు, చెడుగా ఉన్నప్పుడు వాళ్లు మనల్ని చూశారు. ముఖ్యంగా మన గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అయినా కూడా మనం ఎలా ఉన్నామో అలాగే ప్రేమిస్తారు. అంగీకరిస్తారు కూడా.. ఒక తోబుట్టువులా మిమ్మల్ని మరెవరు అర్థం చేసుకోలేరని నేను అనుకుంటున్నాను. అన్నాచెల్లెళ్ల మధ్య బంధంలో ఒక ప్రత్యేకమైన బంధం ఉంది.. ఎంతో చరిత్ర , ఎన్నో జ్ఞాపకాలు, ఎల్లప్పుడూ తోడుగా ఉండే ప్రేమ ఈరోజు నా సోదరుడికి, మేము పుట్టిన ఈ అందమైన బంధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతతో ఉన్నాను. జీవితంలో అత్యంత విలువైన బహుమతులలో ఇది కూడా ఒకటి. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ తన సోదరుడు మహేష్ బాబుతో తనకున్న బంధాన్ని ఈ విధంగా పోస్ట్ పెట్టింది ఘట్టమనేని మంజుల.

వరుణ్ తేజ్ - నిహారిక:

టాలీవుడ్ లో క్యూట్ అన్నా చెల్లెలు అనగానే వెంటనే గుర్తొచ్చే వారు వరుణ్ తేజ్ - నిహారిక . ఇద్దరు తమ చిన్ననాటి గొడవలను బహిరంగంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా టామ్ అండ్ జెర్రీలా ఉండే వారిద్దరి మధ్య బంధం తర్వాత ప్రాణ స్నేహితులుగా మారిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు నిహారిక నిర్మిస్తున్న చిత్రాలలో వరుణ్ తేజ్ నటిస్తూ.. బిజినెస్ పార్టనర్లు కూడా అయిపోయారు. ఇక నిహారికతో తనకున్న బంధాన్ని వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో తెలుపుతూ.." మేమిద్దరం ఒకప్పుడు చాలా గొడవ పడే వాళ్ళం. కానీ పెద్దయ్యాక అంతా మారిపోయింది . ఎప్పుడు ఏది జరిగినా.. స్వేచ్ఛగా చెప్పుకొనే నా అత్యంత సన్నిహిత స్నేహితులలో నిహారిక ఒకరు. నేను ఆమెతో ఏదైనా పంచుకోగలను" అంటూ తెలిపారు.

నితిన్ - నికితా రెడ్డి..

తోబుట్టువులైన వీరిద్దరూ అటు కెరియర్ లో కూడా భాగస్వాములుగా మారారు. ముఖ్యంగా నితిన్ హీరోగా నటించిన ఇష్క్ , గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీకోసం వంటి చిత్రాలకు తన సొంత బ్యానర్ పై నిర్మాతగా వ్యవహరించింది నికితా రెడ్డి.

రామ్ చరణ్ - సుస్మిత:

ఇక టాలీవుడ్ లో అన్నా చెల్లెలుగా అందరినీ ఆకట్టుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న వారిలో రామ్ చరణ్ , సుస్మిత కూడా ఒకరు. సుస్మిత ఎప్పటికప్పుడు తన సోదరుడు రామ్ చరణ్ పై తన ప్రేమను వలకబోస్తూ ఉంటుంది. "మేము తోబుట్టువులం అవ్వడమే కాకుండా చరణ్ ,నేను మంచి స్నేహితులం. ఎక్కువగా కలిసి తిరుగుతాం

. కలిసి పని చేస్తాం.. ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నానో అతడు సులభంగా అర్థం చేసుకుంటాడు" అంటూ తన సోదరుడిపై తనకున్న ప్రేమను వలకబోసింది.

Tags:    

Similar News