ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్‌.. ప్రభాస్‌- రాజమౌళి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్!

టాలీవుడ్‌లో హీరోగా ప్రభాస్‌ స్థానం ఎంత ప్రత్యేకమో.. ఆయన వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో వినిపించే మాటలు కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంటాయి.

Update: 2026-08-20 11:12 GMT

టాలీవుడ్‌లో హీరోగా ప్రభాస్‌ స్థానం ఎంత ప్రత్యేకమో.. ఆయన వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో వినిపించే మాటలు కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళితో ప్రభాస్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛత్రపతి సినిమాతో మొదలైన వీరి ప్రయాణం.. బాహుబలి, బాహుబలి2 సినిమాలతో మరింత స్ట్రాంగ్ బాండింగ్ గా మారింది. తాజాగా ప్రభాస్‌ వ్యక్తిత్వానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రాజమౌళి వెల్లడించారు.

ఓ సందర్భంలో ప్రభాస్ ఎక్స్‌ట్రా రెమ్యూన‌రేష‌న్ తీసుకునే విషయంలో కూడా ఎంతో సింపుల్‌గా ఆలోచించాడని రాజమౌళి చెప్పుకొచ్చారు. నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్‌ను కలిసి ఎక్స్‌ట్రా రెమ్యూనరేషన్‌ ఇస్తామని చెప్పినప్పుడు.. ప్రభాస్ తనకు ఫోన్‌ చేసి మనం అలా తీసుకోవచ్చా? అని అడిగాడని, “వాళ్లే ఇస్తామని అంటున్నారు కదా.. తీసుకో” అని తాను ప్రభాస్‌కు చెప్పినట్లు రాజమౌళి తెలిపారు. అయితే, ప్రభాస్‌ మాత్రం ఆ మొత్తాన్ని తీసుకోవడంపై కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించాడని ఆయన చెప్పారు. నేను రెండు సినిమాలు చేస్తే కవర్‌ అయిపోతుంది. వాళ్లు లైఫ్‌ రిస్క్‌ పెట్టి తీశారు కదా అని ప్రభాస్‌ తనతో అన్నాడని రాజ‌మౌళి చెప్పారు.

అంతేకాదు.. ఆ టైమ్ లో ఫైనాన్షియ‌ల్ గా సిట్యుయేష‌న్ కాస్త టైట్‌గా ఉందని, ఏదైనా యాడ్‌ చేస్తే బాగుంటుందేమోనని ప్రభాస్‌ తనతో చెప్పినట్లు రాజమౌళి వెల్లడించారు. దానికి తాను ‘పర్లేదు.. హ్యాపీగా తీసుకో’ అని చెప్పానని, ప్ర‌భాస్ క్యారెక్ట‌రే అంత అంటూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభాస్‌ స్వభావం గురించి రాజమౌళి చెప్పిన మాట ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సినిమా కోసం భారీ స్థాయిలో పనిచేసే హీరోగా మాత్రమే కాకుండా.. నిర్మాతలు, సినిమా వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా ఆలోచించే మనస్తత్వం ప్రభాస్‌లో ఉందని ఈ ఘటన మరోసారి చూపిస్తోంది. ముఖ్యంగా నిర్మాత స్వ‌యంగా ఎక్స్‌ట్రా రెమ్యూన‌రేష‌న్ ఇస్తాన‌న్న‌ప్పుడు కూడా తీసుకోవచ్చా? అని డైరెక్ట‌ర్‌ను అడగడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజమౌళి- ప్రభాస్ బాండింగ్ కేవలం డైరెక్ట‌ర్- హీరో సంబంధానికే పరిమితం కాలేదు. ఛత్రపతి నుంచి బాహుబలి2 వరకు కలిసి పనిచేసిన అనుభవం.. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా కూడా ఎంతో నమ్మకాన్ని పెంచింది. ఇప్పుడు ప్రభాస్‌ గురించి రాజమౌళి చెప్పిన ఈ మాటలు మరోసారి ఆ బాండింగ్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా రెమ్యూన‌రేష‌న్ కంటే సినిమా కోసం రిస్క్‌ తీసుకున్న నిర్మాతల గురించి ప్రభాస్‌ ఆలోచించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News