టైమ్ ట్రావెల్ చేసినట్టే.. రాశీ ఖన్నా ఓల్డ్ డేస్ షేర్
కేవలం షూటింగ్ బిజీలోనే కాకుండా, మైసూర్ లోని చారిత్రాత్మక ప్రదేశాలు తిరుగుతూ, అక్కడి ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరి, సరదా ముచ్చట్లను ఫోటోల రూపంలో షేర్ చేయడంతో ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటిస్తున్న క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ 'ధర్మన్' సినిమా షూటింగ్ నిమిత్తం మైసూర్ వెళ్లిన టాలెంటెడ్ బ్యూటీ రాశి ఖన్నా, అక్కడ గడిపిన మధురమైన క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కేవలం షూటింగ్ బిజీలోనే కాకుండా, మైసూర్ లోని చారిత్రాత్మక ప్రదేశాలు తిరుగుతూ, అక్కడి ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన అల్లరి, సరదా ముచ్చట్లను ఫోటోల రూపంలో షేర్ చేయడంతో ఆ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మైసూర్ వీధుల్లో సరదా క్షణాలు:
తాజాగా షేర్ చేసిన ఫోటోలలో రాశి ఖన్నా ఎంతో సహజంగా, సంతోషంగా కనిపిస్తోంది. పచ్చని సోఫాలో కూర్చుని స్నేహితులతో 'యూనో' గేమ్ ఆడుతూ మనసారా నవ్వుతున్న ఒక ఫోటో, గుడి మెట్లపై సంప్రదాయ దుస్తుల్లో కూర్చుని ఉన్న మరొక ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా నెమలి ఈకల వింజామరలు పట్టుకున్న కళాకారుల మధ్య ఆమె దిగిన పిక్స్ అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
'మైసూర్ దోశ'పై ప్రత్యేక దృష్టి:
ఈ ట్రిప్ విశేషాలను తెలుపుతూ రాశి ఖన్నా "మైసూర్‌లో నేను జీవిస్తున్న ప్రపంచం నుంచి కొద్దిగా గుళ్ల సందర్శన, కాస్త తిరుగుళ్లు, యూనో ఆటలు, బోలెడన్ని నవ్వులు. ఇక మైసూర్ దోశ కచ్చితంగా తనకంటూ ఓ ప్రత్యేక క్షణాన్ని కోరుకుంది" అంటూ చక్కటి క్యాప్షన్ జతచేసింది. ఈ క్యూట్ పోస్ట్ చూసిన అభిమానులు "బ్యూటిఫుల్ ప్లేస్", "సో క్యూట్ అండ్ గోర్జియస్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
'ఊహలు గుసగుసలాడే' నుంచి స్టార్‌డమ్ వరకు:
ఇక 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రాశి, 'బెంగాల్ టైగర్', 'తొలిప్రేమ', 'సర్దార్', 'అరన్మనై 4' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో 'యోధ', 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాలతో పాటు 'ఫర్జీ' వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ, ఇక ఇటీవల టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో తన సత్తా చాటింది.ఇక అంతేకాక పాటు అక్షయ్ కుమార్, విద్యాబాలన్ చిత్రాలు, ఫర్హాన్ అక్తర్‌తో '120 బహదూర్' తో గత ఏడాది మెప్పించింది..
చేతిలో వరుస క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్టులు:
ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక రాజ్ అండ్ డీకే క్రేజీ సిరీస్ 'ఫర్జీ 2'లో నటిస్తోంది. అలాగే రజనీకాంత్ 'ధర్మన్' సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో దూసుకెళ్తోంది. ఇక సినిమాల బిజీ బిజీ షూటింగ్స్ మధ్య ఇలాంటి ప్రశాంతమైన ప్రయాణాలతో సేద తీరుతున్న రాశి ఖన్నా, రాబోయే రోజుల్లో వెండితెరపై మరింత ఉత్సాహంగా అద్భుతమైన విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.