'పాపం ప్ర‌తాప్‌' సెట్లో కెళ్లాక రాశి షాక్ అయ్యార‌ట‌!

హీరోయిన్‌గా ఒక ద‌శ‌లో హాట్ ఫేవ‌రేట్‌గా నిలిచిన న‌టి రాశి. అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ ఫేవ‌రేట్ అనిపించుకుంది.;

Update: 2026-04-18 08:55 GMT

హీరోయిన్‌గా ఒక ద‌శ‌లో హాట్ ఫేవ‌రేట్‌గా నిలిచిన న‌టి రాశి. అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ ఫేవ‌రేట్ అనిపించుకుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో క్రేజీ స్టార్ల‌తో న‌టించిన మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ని వివాహం చేసుకుని సినిమాల‌కు కొంత కాలం దూరంగా ఉంటూ వ‌స్తున్న రాశి సీరియ‌ల్స్‌లోనూ అమ్మ పాత్ర‌ల్లో మెరిసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ వెండితెర‌పై సీనియ‌ర్ స్టార్‌గా ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు.

సినిమాల్లోనూ మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లు పెట్టిన రాశి త‌న క్రేజ్‌కు త‌గ్గ క్యారెక్ట‌ర్ల‌ని సొంతం చేసుకోలేక‌పోతున్నారు. తాజాగా తిరువీర్ క‌థ‌నాయ‌కుడిగా న‌టించిన `పాపం ప్ర‌తాప్‌` సినిమాలో హీరో త‌ల్లిగా క‌నిపించి అల‌రించారు. అయితే ఈ క్యారెక్ట‌ర్ గురించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించి షాక్ ఇచ్చారు రాశి. ఇప్పుడున్న ఆర్టిస్ట్‌ల పేర్లు నాకు తెలియ‌దు. ఆర్టిస్ట్‌ని చూస్తే గుర్తు ప‌డ‌తా. ఇందులో న‌టించిన అజ‌య్ ఘోష్ రంగ‌స్థ‌ల న‌టులు. అయితే ఆయ‌న పేరు నాకు తెలియ‌దు. మ‌నిషి చూస్తే గుర్తు ప‌డ‌తాను.

ద‌ర్శ‌కుడు నాకు క‌థ చెప్పిన‌ప్పుడు నా ప‌క్క‌న అజ‌య్ గారు న‌టిస్తున్నారంటే టాల్‌గా ఉండే అజ‌య్ అనుకున్నాను. ఆయ‌నే అనుకుని నేను ఫిక్స్ అయ్యాను. ఫ‌స్ట్ డే లొకేష‌న్‌లోకి వెళ్ల‌గానే మేక‌ప్ పూర్తి చేసుకుని జ‌డ వేసుకున్నాను. అజ‌య్ కొంచెం యంగ్‌గా ఉంటారు. అందుకే నేను జ‌డ వేసుకున్నాను. అయితే క్యార‌వాన్‌లోని వ‌చ్చిన ద‌ర్శ‌కుడు మీరు యంగ్‌గా ఉన్నారు అన్నాడు. నా అసిస్టెంట్ `ఆమె హీరోయినే క‌దా` అన్నాడు. అంటే మీరు మ‌ద‌ర్‌లా క‌నిపించ‌ట్లేద‌ని చెప్పాడు డైరెక్ట‌ర్‌.

అయితే నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అన్నాను. వెన‌కాల జ‌డ కాకుండా ముడి వేసుకోండి అన్నాడు. ఓకే అని అలాగే వేసుకున్నాను. సెట్‌లోకి వెళ్లి నేను అజ‌య్‌ని వెతుకుతున్నాను. అయితే అక్క‌డ ఓ చైర్‌లో అజ‌య్ ఘోష్ గారు కూర్చుని ఉన్నారు. ఆయ‌న‌ని చూసి ఓకే ఈయ‌న మా మామ‌య్య‌గారి క్యారెక్ట‌రా? ఏంటీ అనుకున్నాను. ఇంత‌లో ఒక‌మ్మాయి వ‌చ్చి ఏంట‌మ్మా వెతుకుతున్నారు? అని అడిగింది.

అదే అజ‌య్‌ గారు ఎక్క‌డా అని వెతుకుతున్నాను అన్నాను. ఆయ‌నే క‌దా మేడం అజ‌య్ ఘోష్ అని త‌ను చూపించింది. ఆయ‌నే అని తెలిసి షాక్ అయ్యాను. ఇదేంటి అని డైరెక్ట‌ర్‌ని అడిగితే అప్ప‌ట్లో చిన్న వ‌య‌సులోనే పెళ్లిళ్లు జ‌రుగుతుంటాయి క‌దా? అన్నారు. అజ‌య్ ఘోష్ గారు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్‌. ఆయ‌న‌తో ఫ‌స్ట్ టైమ్ వ‌ర్క్ చేశాను. ఆయ‌న సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌. అది స్టేజ్ ఫెర్ఫార్మ‌ర్స్‌కే ఉంటుంది. హిలేరియ‌స్ కామెడీని అన్ ద స్పాట్ ఇంప్రూవ్ చేసి చేశారు. ఏ విష‌యంలోనూ కాంప్ర‌మైజ్ కారు ఆయ‌న‌` అంటూ అజ‌య్ ఘోష్ గురించి చెప్పుకొచ్చారు.



Tags:    

Similar News