కొరియన్ కనకరాజు మాస్ బాంబ్.. పెద్ద ప్లస్ అవుతుందా?
ఇప్పటికే టీజర్ తో ఆసక్తి రేపిన మూవీంత్రం.. ఇప్పుడు రాసా గుమ్మడి అనే మాస్ సాంగ్ విడుదల చేయడానికి సిద్ధమైంది.
సినిమా ప్రమోషన్ లో ఒక్కోసారి టీజర్ కంటే పాటే ఎక్కువ హైప్ తీసుకొస్తుంది. ముఖ్యంగా మాస్ హీరోలకు అయితే స్పెషల్ సాంగ్ లేదా ఫుల్ ఎనర్జీ నంబర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్ తో ఆసక్తి రేపిన మూవీంత్రం.. ఇప్పుడు రాసా గుమ్మడి అనే మాస్ సాంగ్ విడుదల చేయడానికి సిద్ధమైంది.
జూలై 19న రిలీజ్ కానున్న ఆ పాటపై మూవీ యూనిట్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన ఆ సాంగ్ కంప్లీట్ మాస్ బీట్ తో ఉండబోతుందని సమాచారం. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఆ పాట సినిమాలో కీలక ఆకర్షణగా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొరియన్ కనకరాజుపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం టీజర్.
రాయలసీమ నేపథ్యంలో కనిపించే కనకరాజు పాత్ర, ఆ తర్వాత వచ్చే సూపర్ నేచురల్ ట్విస్ట్, కొరియా కనెక్షన్ వంటి అంశాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుండడం ప్రేక్షకుల్లో చర్చకు దారి తీశాయి. ఇలాంటి సమయంలో విడుదలవుతున్న రాసా గుమ్మడి పాట సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వొచ్చని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా మాస్ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయితే వాటి ఎఫెక్ట్ నేరుగా సినిమా ప్రమోషన్స్ పై కనిపిస్తుంది.
రీల్స్, షార్ట్స్ రూపంలో పాట ప్రేక్షకుల దగ్గరకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ పాటలో నటి దక్షా నగార్కర్ ప్రత్యేక ఆకర్షణగా కనిపించనుంది. స్పెషల్ సాంగ్ కావడంతో డ్యాన్స్ స్టెప్స్, విజువల్స్ పై కూడా చిత్రబృందం ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ లుక్, ఆయన డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెబుతున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో ఆ సినిమా ప్రత్యేక ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. గతంలో ఆయన చేసిన చిత్రాలకు భిన్నంగా హారర్, కామెడీ, యాక్షన్ అంశాలను కలిపి ఈ కథను రూపొందించారు.
దర్శకుడు మేర్లపాక గాంధీ తనదైన కామెడీ టచ్‌తో సినిమాను తెరకెక్కిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే టీజర్ మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు రాసా గుమ్మడి పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమా చుట్టూ మరింత బజ్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడంలో ఇలాంటి పాటలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఆగస్టు 7న విడుదల కానున్న కొరియన్ కనకరాజుకు ప్రస్తుతం ప్రమోషన్ల రూపంలో మంచి ఊపు కనిపిస్తోంది. టీజర్ తర్వాత ఇప్పుడు ఆ మాస్ సాంగ్ కూడా క్లిక్ అయితే.. సినిమా విడుదలకు ముందే వరుణ్ తేజ్ ఖాతాలో మరో స్ట్రాంగ్ ప్రమోషనల్ వెపన్ చేరినట్లే అవుతుంది. ప్రేక్షకులు మాత్రం ఇప్పుడు జూలై 19న వచ్చే రాసా గుమ్మడి పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.