జిమ్ కాదు.. మాధవన్ యంగ్ లుక్ వెనుక అసలు కారణం ఇదే!

సినీ సెల‌బ్రిటీలు ఎప్పుడూ యవ్వనంగా, ఫిట్‌గా కనిపించడం వెనుక ఖరీదైన ట్రీట్‌మెంట్లు, కఠినమైన డైట్స్ లేదా గంటల తరబడి జిమ్‌లో గడపడమే కారణమని చాలా మంది భావిస్తుంటారు.

Update: 2026-07-19 05:48 GMT

సినీ సెల‌బ్రిటీలు ఎప్పుడూ యవ్వనంగా, ఫిట్‌గా కనిపించడం వెనుక ఖరీదైన ట్రీట్‌మెంట్లు, కఠినమైన డైట్స్ లేదా గంటల తరబడి జిమ్‌లో గడపడమే కారణమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఫిట్‌నెస్ నిపుణులు చెప్పేది మాత్రం పూర్తిగా భిన్నం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత కీలకమైనవి రోజువారీ అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ తీసుకునే నిర్ణయాలేనని వారు చెబుతున్నారు. సెలబ్రిటీల ఫిట్‌నెస్ రొటీన్లను పరిశీలించినా ఇదే అంశం స్పష్టంగా కనిపిస్తుంది.

ఫిట్‌నెస్‌కు సంబంధించిన అతిపెద్ద అపోహల్లో ఒకటి జిమ్‌లో ఎక్కువ సమయం గడిపితేనే ఆరోగ్యంగా ఉంటార‌నేది. వాస్తవానికి వాకింగ్, స్విమ్మింగ్, ఫిజిక‌ల్ గేమ్స్, యోగా, సైక్లింగ్ వంటి శారీరక చలనం కలిగించే ఏ ఎక్సర్‌సైజ్ అయినా శరీరాన్ని చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదే కాకుండా స్పెష‌ల్ గా సూపర్‌ఫుడ్స్ లేదా కాస్ట్లీ డైట్ ప్లాన్‌లే ఫిట్‌నెస్‌కు మార్గమని అపోహ ప‌డుతుంటారు. కానీ పోషకాహార నిపుణులు బ్యాలెన్డ్స్ డైట్, సరైన నిద్ర, తగినంత నీరు, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలే దీర్ఘకాల ఆరోగ్యానికి పునాది అంటున్నారు.

స్కిన్ కేర్ విషయంలో కూడా ఎన్నో అపోహలున్నాయి. కేవలం కాస్మొటిక్ ఉత్పత్తులతోనే యంగ్ లుక్ వస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే పరిమిత మోతాదులో సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి, మంచి ఫుడ్, తగిన విశ్రాంతి కూడా చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు వివరిస్తున్నారు. అదే సమయంలో అధికంగా ఎండలో ఉండటం చర్మానికి హానికరమని, కాబట్టి సమతుల్యత అవసరమని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రీసెంట్ గా ప్ర‌ముఖ నటుడు ఆర్. మాధవన్ తన ఫిట్‌నెస్ రొటీన్ గురించి వెల్లడించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్ర‌స్తుతం మాధ‌వ‌న్ వ‌య‌సు 56. కానీ ఆయ‌న ఇప్ప‌టికీ కుర్రాడిలాగానే క‌నిపిస్తారు. అయితే త‌న హెల్త్ సీక్రెట్ లో ఎలాంటి మ్యాజిక్ లేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తీ రోజూ ఉద‌యం లేవ‌గానే గోల్ఫ్ ఆడ‌టంతో పాటూ శరీరానికి కావాల్సిన ఎండ త‌గిలేలా చూసుకుంటాన‌ని, కొబ్బ‌రినూనెతో చేసిన వంట‌ల‌ను మాత్ర‌మే తింటాన‌ని, ఎప్పుడైనా బ‌రువు పెరుగుతున్న‌ట్టు అనిపిస్తే వ‌ర్కౌట్స్ తీవ్ర‌త‌ను పెంచుతూ, వారానికి ఒక‌సారి నువ్వుల నూనెతో స్నానం చేస్తూ ఉండ‌టం వ‌ల్లే తాను అలా క‌నిపిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఫిట్‌నెస్ అనేది ఒక్క‌రోజులో సాధించే టార్గెట్ కాద‌ని మాధ‌వ‌న్ కామెంట్స్ మ‌రోసారి గుర్తు చేస్తున్నారు. క్ర‌మం త‌ప్ప‌ని వ్యాయామం, బ్యాలెన్డ్స్ డైట్, హెల్తీ లైఫ్‌స్టైలే ఫిట్‌నెస్ కు అస‌లైన సీక్రెట్ అనే విష‌యాన్ని మాధ‌వ‌న్ రొటీన్ మ‌రోసారి డిస్క‌ష‌న్ లోకి తీసుకొచ్చింది.

Tags:    

Similar News