కార్పొరేట్ వివాదాలు - మీడియా ఊహాగానాలు!

వాషు భగ్నానీ సంస్థ నుండి రావాల్సిన పాత బాకీలు సకాలంలో చెల్లించనందున పివిఆర్ ఐనాక్స్ సంస్థ ఆయనపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైందని ప్రచారం జరిగింది.

Update: 2026-05-31 08:00 GMT

ఈ మ‌ధ్య కాలంలో తెరవెనుక జరిగే వ్యాపార లావాదేవీలు కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్ల‌ యాజమాన్యాలు -నిర్మాతల మధ్య ఉండే ఆర్థిక సంబంధాలపై వ‌స్తోన్న క‌థ‌నాలు అంత‌కంత‌కు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల దేశీయ మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్- బాలీవుడ్ సీనియర్ నిర్మాత వాషు భగ్నానీ (పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్) మధ్య పెద్ద ఎత్తున ఆర్థిక వివాదం నడుస్తోందంటూ సోషల్ మీడియా లో వార్తలు హల్‌చల్ చేశాయి. వాషు భగ్నానీ సంస్థ నుండి రావాల్సిన పాత బాకీలు సకాలంలో చెల్లించనందున పివిఆర్ ఐనాక్స్ సంస్థ ఆయనపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైందని ప్రచారం జరిగింది.

డిజిటల్ యుగంలో ఇలాంటి సున్నితమైన వ్యాపార విషయాలు క్షణాల్లో కార్పొరేట్ వర్గాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఇలాంటి ప్ర‌చారాలు సదరు నిర్మాణ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విమర్శకులు..ట్రేడ్ విశ్లేషకులు ఈ నివేదికలపై రకరకాల విశ్లేషణలు చేయడం ఇండస్ట్రీలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తుంది. తాజాగా ఈ వ్యవహారంపై పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ అధికారికంగా స్పందించి ప్రచారాలన్నింటినీ పూర్తిగా ఖండించింది. తాము నిర్మాత వాషు భగ్నానీపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదంది.

ప్రచారంలో ఉన్న నివేదికలన్నీ తప్పుడు సమాచారంతో కూడుకున్నవని స్పష్టం చేసింది. ఇరు సంస్థల మధ్య ఎలాంటిచట్టపరమైన విబేధాలు లేవని.. మీడియాలో వచ్చిన కథనాలు కేవలం ఊహాజనితమైనవని కొట్టిపా రేయడం తో తాత్కాలికంగా తెరపడింది. వాస్తవానికి వాషు భగ్నానీ సంస్థ పూజా ఎంటర్ టైన్‌మెంట్స్ గత కొంతకా లంగా పెద్ద బడ్జెట్ చిత్రాల పరాజయాలతో ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందనే టాక్ బాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది. గతంలో కూడా కొందరు సాంకేతిక నిపుణులు, నటీనటుల వేతనాల బకాయిల విషయంలో ఈ సంస్థపై వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పివిఆర్ ఐనాక్స్ లీగల్ నోటీసుల రూమర్ రాగానే ఇండస్ట్రీ వర్గాలు దానిని సులభంగా నమ్మేలా చేసింది.

ఈ రకమైన వ్యతిరేక వాతావరణం ఉన్నప్పుడు చిన్న పుకారు కూడా పెద్ద వివాదంగా మారడం సహజం. చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ చైన్‌లకు -నిర్మాతలకు మధ్య ఉన్న బంధం పరస్పర ఆధారితమైనది. ఒకరి మనుగడకు మరొకరి స‌హ‌కారం ఎంతో అవసరం. బాక్సాఫీస్ కలెక్షన్ల షేరింగ్ లేదా ఇతర చెల్లింపుల విషయంలో చిన్నపాటి ఆలస్యాలు .. విభేదాలు తలెత్తినప్పుడు కార్పొరేట్ సంస్థలు సాధారణంగా అంతర్గత చర్చల ద్వారానే వాటిని పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతాయి. న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల ఇరుపక్షాల వ్యాపార సంబంధాలు దెబ్బతినడమే కాకుండా రాబోయే చిత్రాల విడుదలకు ఆటంకం కలుగుతుందని భావిస్తారు.

Tags:    

Similar News