పురుషః: చిన్న సీన్ కోసం చిరంజీవి మూవీ 150 సార్లు చూశా - హీరో
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు.
టాలీవుడ్‌లోకి సరికొత్త కుర్రాడు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వంలో, బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మే 22న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటలను బయటపెట్టాడు. సినిమాలో ఒక తాగుబోతు సీన్ పర్‌ఫెక్ట్‌గా రావడం కోసం మెగాస్టార్ చిరంజీవి పాత సినిమా సీన్‌ను ఏకంగా 150 సార్లు చూసి నేర్చుకున్నానని చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.
సీనియర్లతో యాక్టింగ్.. మంచి ఎక్స్‌పీరియన్స్:
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, రాయంచ కొక్కుర లాంటి ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అంత పెద్ద నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల షూటింగ్ టైమ్‌లో ఎన్నో కొత్త విషయాలను, నటనలోని మెళకువలను నేర్చుకున్నానని హీరో పవన్ కళ్యాణ్ బత్తుల సంతోషంగా పంచుకున్నాడు. ఇక ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు.
చిరంజీవి సీన్ 150 సార్లు ఎందుకు చూశారంటే?:
సినిమాలో ఒక క్రేజీ తాగుబోతు సీన్ (డ్రింకింగ్ సీన్) ఉందట. దానికోసం చాలామంది హీరోలు చేసిన సీన్స్ చూసినా.. తనకు పర్సనల్‌గా చిరంజీవి గారు అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ముఖ్యంగా చిరంజీవి పాత సినిమా జై చిరంజీవ లోని చిరంజీవి, వేణుమాధవ్, కాంబినేషన్ కామెడీ సీన్‌ను దాదాపు 150 సార్లు చూశానని, ఆయన బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌ను గమనించి ఈ సినిమాలో ఆ సీన్ చేశానని తన మెగా అభిమానాన్ని చాటుకున్నాడు.
పేరు వెనుక పవన్ కళ్యాణ్ సెంటిమెంట్:
తనకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను కూడా ఈ సందర్భంగా గుర్తేసుకున్నాడు. తాను 'గోకులంలో సీత' సినిమా వచ్చే టైమ్‌లో పుట్టానని.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి, 'తమ్ముడు' సినిమా టైమ్‌లో వాళ్ల నాన్నగారు పవన్ కళ్యాణ్ అని నామకరణం చేశారట. ఇక అలా పుట్టినప్పటి నుంచే తన పేరుతో ఒక స్టార్ సెంటిమెంట్ కలిసి వచ్చింది.
నాన్న కల కోసం వైజాగ్‌లో ట్రైనింగ్:
నన్ను వెండితెరపై హీరోగా చూడాలనేది మా నాన్నగారి పెద్ద కల.. నాక్కూడా సినిమాలంటే విపరీతమైన ఇష్టం అని పవన్ కళ్యాణ్ బత్తుల తెలిపాడు. ఇక నాన్న కోరికను నిజం చేయడం కోసం వైజాగ్‌లోని ఫేమస్ స్టార్ మేకర్ సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నానని.. ఇక ఆ శిక్షణతోనే ఇప్పుడు 'పురుషః' సినిమా ద్వారా నటుడిగా మీ ముందుకు వస్తున్నానని చెప్పాడు.
మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని, పవన్ కళ్యాణ్ పేరును గుండెల్లో పెట్టుకుని టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు ఈ యంగ్ హీరో.ఇక మరి 150 సార్లు చూసి చేసిన ఆ తాగుబోతు సీన్ థియేటర్లలో ఏ రేంజ్ నవ్వులు పూయించిందో, ఈ నెల 22న రిలీజ్ కాబోతున్న పురుషః సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో చూడాలి.