సూప‌ర్ స్టార్ కి స్టోరీ చెప్పిన డ్యాషింగ్ డైరెక్ట‌ర్!

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాద్ కు కొంత కాలంగా స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో? విజ‌యం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు

Update: 2026-08-28 02:55 GMT

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాద్ కు కొంత కాలంగా స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో? విజ‌యం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతోప‌తితో `స్ల‌మ్ డాగ్ టెంపుల్ ర‌న్` చిత్రాన్ని తెర‌కెక్కించి రిలీజ్ ప‌నుల్లో ఉన్నారు. ఈ సినిమాపై పూరి చాలా ఆశ‌లే పెట్టుకున్నారు. మంచి హిట్ ఇచ్చి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని చూస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇటీవ‌లే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పూరి ఓ లైన్ వినిపించార‌ని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

పూరి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, రజనీ స్టైల్ అండ్ స్వాగ్‌కు సరిపోయేలా లైన్ ఉంద‌ని లీకులందుతున్నాయి. నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం ఊహ‌కే అంద‌దు. పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోల పాత్రలు పదునుగా, భయం లేని బాడీ లాంగ్వేజ్‌తో ఉంటాయి. సూప‌ర్ స్ టార్ వయసుతో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న తరుణంలో ఆయన ఇమేజ్‌కు తగినట్లుగా పూరి యూనిక్ క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేసారంటే తిరుగుండ‌దు. క‌థ విన్న త‌ర్వాత ర‌జ‌నీ కూడా పాజిటివ్ గానే ఉన్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం

ప్రచార దశలోనే ఉన్న వార్త సినిమా సర్కిల్స్‌లో మాత్రం సరికొత్త వైబ్రేషన్‌ను క్రియేట్ చేస్తోంది. ఒకవైపు రజనీకాంత్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుండగా మరోవైపు పూరి జగన్నాధ్ తనదైన మార్క్ కంబ్యాక్ కోసం ప్లాన్ చేస్తు న్నారు. ఇద్దరి కలయికలో సినిమా వస్తే మాత్రం అది ఇండియన్ సినిమా చరిత్రలో మరొక సంచలనంగా మారుతుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కాంబినేష‌న్ సెట్ అయితే ర‌జ‌నీకాంత్ ఉన్న ప‌ళంగా డేట్లు కేటాయిస్తారా? అన్న‌ది సందేహ‌మే. ఎందుకంటే ర‌జ‌నీ ఇప్ప‌టికే క‌మిట్ అయిన కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది.

ఇటీవ‌లే జైల‌ర్ షూటింగ్ పూర్తి చేసారు. ప్ర‌స్తుతం అశ్వ‌త్ మారిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న `ధ‌ర్మ‌న్` లో న‌టిస్తున్నారు. ఈ సినిమా అనంత‌రం క‌మ‌ల్ స‌హాస‌న్-ర‌జనీకాంత్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు మ‌రికొంత మంది ఫాంలో ఉన్న ద‌ర్శ‌కుల క‌థ‌ల్ని ర‌జ‌నీ హోల్డ్ లో పెట్టారు. వాటికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వీట‌న్నింటి మ‌ధ్య పూరి క‌థ‌ను తెర‌కెక్కించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News