ధురంధర్ 2.. ప్రభాస్ విషయంలో వంగా ప్లానేంటి?
భారీ అంచనాల మధ్య విడుదలై అంతకుమించిన విజయాన్ని అందుకుని ధురంధర్ సీక్వెల్ ధురంధర్: ది రివెంజ్ చిత్రం దూసుకుపోతూనే ఉంది.;
భారీ అంచనాల మధ్య విడుదలై అంతకుమించిన విజయాన్ని అందుకుని ధురంధర్ సీక్వెల్ ధురంధర్: ది రివెంజ్ చిత్రం దూసుకుపోతూనే ఉంది. ఇంకా మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా.. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ థియేటర్ లో ఆ సినిమాను సినిమా వీక్షించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాని వెనుక ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే ప్లాన్ ఉందని అభిప్రాయం వినిపిస్తోంది.
సాధారణంగా ఒక స్టార్ హీరో మరో హీరో సినిమా చూడటం సహజమే అయినా.. ఇప్పుడు ధురంధర్ 2 విషయంలో మాత్రం ప్రత్యేకమైన ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రణవీర్ సింగ్ యాక్టింగ్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు వస్తున్నాయి. ఆయన నటనలో కనిపించిన ఇంటెన్సిటీ, హార్డ్ వర్క్, పాత్రలో ఒదిగిపోవడం వంటి అంశాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
సినిమాను చూసిన వారు రణవీర్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ను థియేటర్ కు తీసుకెళ్లి మూవీ చూపించడం ద్వారా సందీప్ రెడ్డి వంగా మంచి మోటివేషన్ ఇవ్వాలనుకున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్, తర్వాతి సినిమాల విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా ఆదిపురుష్ వంటి సినిమాలు విమర్శలకు గురయ్యాయి. దీంతో ఆయన నటనపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న అప్ కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వంగా తీసుకున్న ఆ నిర్ణయం కేవలం సినిమా చూపించడమే కాకుండా, ఒక రకంగా నటుడిని ఎంకరేజ్ చేసే పెద్ద ప్రయత్నంగా తెలుస్తోంది.
ఒక స్టార్ హీరో మరో స్టార్ నటనను ప్రత్యక్షంగా చూసి.. తనలో మరింత ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నించాలనే భావన కలిగించడం కూడా దర్శకుడి బాధ్యతల్లో భాగమేనని.. ఇప్పుడు సందీప్ వంగా అదే చేశారని టాక్ వినిపిస్తోంది. తనను తాను సవాల్ చేసుకునేలా ప్రోత్సహిస్తే ఇంకా సూపర్ అవుట్ పుట్ వస్తుందని వంగా అలా ప్లాన్ చేసి ఉంటారని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే.. ప్రభాస్ కు ధురంధర్ 2 స్పెషల్ స్క్రీనింగ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు తనతో వర్క్ చేసే క్యాస్టింగ్ మెంటాలిటీని అర్థం చేసుకుని, వారికి అవసరమైన ఎంకరేజ్మెంట్ అందించగల లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఇప్పుడు అంతా చెబుతున్నారు. మరి వంగా స్పెషల్ ప్లాన్.. ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.