స్పిరిట్ వంగా అప్డేట్.. సినిమా కోసం నెక్ట్స్ లెవెల్ వెయిటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే, రాబోయే రెండేళ్ల పాటు ఇండియన్ బాక్సాఫీస్‌లో ఆయన హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల లిస్ట్ చూస్తే, రాబోయే రెండేళ్ల పాటు ఇండియన్ బాక్సాఫీస్‌లో ఆయన హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముందుగా ఆడియన్స్ ముందుకు రానున్న ఫౌజీపై భారీ అంచనాలుండగా, ఆ వెంటనే స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాలు జానర్ పరంగా భిన్నంగా ఉండటంతో పాటు, ప్రభాస్ కెరీర్‌లో మరో కొత్త దశను ఆవిష్కరిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
రీసెంట్ గా స్పిరిట్ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ పై డైరెక్టర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆల్రెడీ స్పిరిట్ షూటింగ్ 40% పూర్తైందని ఆయన చెప్పారు. మూవీ అనుకున్న ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోందనే సంకేతాలు కనిపించడంతో, 2027 రిలీజ్‌పై నమ్మకం మరింత బలపడింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో డిస్కషన్ కూడా వేగం పుంజుకున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నప్పటికీ, తిరిగొచ్చిన వెంటనే ఆయన షెడ్యూల్ మళ్లీ బిజీ కానుంది. ముందుగా ఫౌజీ షూటింగ్ కు డేట్స్ కేటాయించి, తర్వాత స్పిరిట్ తర్వాతి షెడ్యూల్స్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. భారీ స్థాయి సినిమాలను సమాంతరంగా సమన్వయం చేస్తూ ముందుకు సాగడం ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకంగా కనిపిస్తోంది.
మరోవైపు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వర్కింగ్ స్టైల్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తన సినిమాలకు సంబంధించిన షూటింగ్ వివరాలను తరచుగా బయటపెట్టని ఆయన, అవసరమైన సందర్భాల్లో మాత్రమే రియాక్ట్ అవుతారనే సంగతి తెలిసిందే. అందుకే స్పిరిట్ షూటింగ్ పై ఆయన డైరెక్ట్ గా మాట్లాడటం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచింది. సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా పెద్ద డిస్కషన్ గా మారే స్థాయిలో ఈ కాంబినేషన్‌పై అంచనాలు నెలకొన్నాయి.
దీంతో మరో ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ వర్క్స్ శరవేగంతో సాగుతున్నాయంటే, ఇక ఫస్ట్ లుక్ ఎప్పుడు? టీజర్ రిలీజ్ కు ఇంకా ఎంత టైముంది? అనే డిస్కషన్ ఫ్యాన్స్ లో మొదలైంది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ ఇంకా రాకపోయినా, ప్రతి చిన్న అప్‌డేట్‌ను సెలబ్రేట్ చేసే స్థాయికి ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. 2027 బాక్సాఫీస్ రేసులో స్పిరిట్ కీలక పోటీదారుగా నిలిచే అవకాశాలపై ఇప్పటికే సినీ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి.