'స్పిరిట్' లో ప్రభాస్ ఇంట్రోపై భారీ హైప్.. వంగా కొత్త ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Update: 2026-08-17 05:47 GMT

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్-ఇండియా స్థాయిలో హైప్ వున్నా మూవీస్ స్పిరిట్ కూడా ఒకటి. ఇందులో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఆయన పాత్రను ఎలా పరిచయం చేయబోతున్నారనే దానిపై రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తూ, అభిమానుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది.

సెంట్రల్ జైల్లో అసలైన విధ్వంసం:

తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా ఒక సెంట్రల్ జైలు వాతావరణంలో ప్రారంభమవుతుందట. జైల్లో ఉన్నట్టుండి పెద్ద గందరగోళం చెలరేగడం, నేరస్థులు నియంత్రణ కోల్పోవడం, అక్కడున్న పోలీసులు కూడా ఆ పరిస్థితిని అదుపు చేయలేక చేతులెత్తేయడం వంటి సన్నివేశంతో కథ మొదలవుతుంది. ఇక ఈ రచ్చ జరుగుతున్న సమయంలోనే ప్రభాస్ క్యారెక్టర్ ఎంట్రీకి వేదిక సిద్ధమవుతుందని తెలుస్తోంది.

భయంతో వణికించే పేరు:

అయితే ఈ సీన్‌లో ప్రభాస్‌ను వెంటనే చూపించకుండా, అక్కడి నేరస్థుల భయం ద్వారా ఆయన పవర్‌ను చూపిస్తారట. ఆ పోలీస్ ఆఫీసర్ పేరు వినగానే ఖైదీల ముఖాల్లో స్పష్టమైన భయం కనిపిస్తుందట. ఇక ఎటువంటి డిజైన్డ్ ఫైట్స్ లేదా భారీ డైలాగులు లేకుండా, కేవలం ఆయన పేరుతోనే ఆ పాత్ర ఎంత ప్రమాదకరమైనదో దర్శకుడు సందీప్ వంగా చాలా పవర్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారట.

పాత హిందీ పాటతో వినూత్నంగా ఇంట్రో:

ప్రభాస్ ఎంట్రీ ఎంతో సైలెంట్‌గా, సైకోటిక్ రేంజ్‌లో ఉండబోతోందని టాక్. ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న ప్రభాస్ చాలా ప్రశాంతంగా, పాత హిందీ పాటలు వింటూ కేజువల్‌గా జైల్లోకి అడుగుపెడతారట. ఇక చుట్టూ ఉన్న నేరస్థులు భయంతో వణుకుతుంటే, ప్రభాస్ మాత్రం క్లాసిక్ సాంగ్ వింటూ కూల్‌గా కనిపించే ఈ కాంట్రాస్ట్ షాట్ సినిమాలోనే అతిపెద్ద హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.

వంగా మార్క్ డార్క్ థ్రిల్లర్:

సాధారణంగా హీరోల ఇంట్రోస్ అంటే డ్రమ్స్ మోత, పెద్ద పెట్టున అరుపులు ఉంటాయి. కానీ సందీప్ వంగా మాత్రం ప్రభాస్‌ను ప్రశాంతత, భయం కలగలిపిన ఒక భిన్నమైన మూడ్‌తో పరిచయం చేయాలని ప్లాన్ చేశారు. ఇక ఇటీవల వచ్చిన ధురంధర్, ఆవారాపన్ 2 వంటి సినిమాల్లో కూడా పాత పాటలతో మాస్ ఎలివేషన్స్ ఇచ్చి మెప్పించారు. ఇప్పుడు వంగా ఏ హిందీ పాటను ఎంచుకుని ప్రభాస్‌ను మరింత డేంజరస్‌గా చూపిస్తారో చూడాలి.

ఇక త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సరికొత్త ఇంట్రో ప్లాన్ నిజమైతే, ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద మరో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News