'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్' ట్యాగ్‌పై ప్రభాస్ రియాక్షన్

భారతీయ సినీ పరిశ్రమలో `బాహుబలి` చిత్రంతో పాన్-ఇండియా సంస్కృతికి శ్రీకారం చుట్టిన ప్రభాస్ తన ఇమేజ్‌కు ఏమాత్రం గర్వం ఆపాదించుకోని అరుదైన వ్యక్తిత్వంతో కనిపిస్తారు.

Update: 2026-08-22 04:26 GMT

భారతీయ సినీ పరిశ్రమలో `బాహుబలి` చిత్రంతో పాన్-ఇండియా సంస్కృతికి శ్రీకారం చుట్టిన ప్రభాస్ తన ఇమేజ్‌కు ఏమాత్రం గర్వం ఆపాదించుకోని అరుదైన వ్యక్తిత్వంతో కనిపిస్తారు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `స్పిరిట్`లో ప్రభాస్ పేరు ముందు `ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్` అని వేయబోతున్నారనే వార్త అప్ప‌ట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భారీ ట్యాగ్‌ను ప్రభాస్ ఎలా స్వీకరించారనే దానిపై నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ప్రభాస్ గారి స్వభావానికి అద్దం పట్టే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

సాధారణంగా నటులు తమ బిరుదులు, ప్రచార ట్యాగ్‌ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అయితే ప్రభాస్ విషయంలో ఈ ప్రకటన ఎలా జరిగింది అన్న ప్రశ్నపై నిర్మాత వివరణ ఇస్తూ... టైటిల్ ఆవిష్కరణకు ముందే ఈ అంశాన్ని ఆయనతో ప్రస్తావించినట్లు తెలిపారు. దీనికి ప్రభాస్ ఎంతో క్యాజువల్‌గా తన సహజ సిద్ధమైన శైలిలో `మీ ఇష్టం డార్లింగ్` అంటూ ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా అంగీకారం తెలిపారట. ఈ ఒక్క చిన్న సమాధానం ప్రభాస్ నిరాడంబరతను, మేకర్స్‌పై ఆయనకు ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ షూటింగ్ షెడ్యూళ్ల సర్దుబాటులో ఎంతో ఫ్లెక్సిబుల్‌గా వ్యవహరిస్తున్నారని నిర్మాత ప్ర‌ణ‌య్ వంగా పేర్కొన్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `ఫౌజీ` చిత్రం పూర్తయిన వెంటనే.. ఆయన పూర్తి స్థాయిలో `స్పిరిట్` సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. రెండు భిన్నమైన మేకింగ్ శైలులు కలిగిన సినిమాల మధ్య ఎంతో నైపుణ్యంతో సమన్వయం పాటిస్తూ.. ప్రభాస్ డేట్లను కేటాయిస్తున్నారని ప్రణయ్ రెడ్డి వంగా కొనియాడారు.

ఇదిలా ఉండగా నిర్మాతలుగా తాము సాధిస్తున్న విజయాల వెనుక దర్శకులకు ఇచ్చే సంపూర్ణ స్వేచ్ఛే కారణమని ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన `రోమాంచకం` చిత్రం అనుభవాలను షేర్ చేస్తూ ``సినిమా నీది, నీ విజన్, నీ ఆలోచన... నీకు నచ్చినట్లు చెయ్`` అని దర్శకుడికి పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చామని తెలిపారు. నిర్మాతలుగా కథా కథనాల విషయంలో జోక్యం చేసుకోకుండా, దర్శకుడి విజన్‌ను తెరపైకి తీసుకురావడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.

చివరగా, `రోమాంచకం` ఫస్ట్ కాపీ చూసినప్పటి అనుభవాన్ని షేర్ చేస్తూ.. ఆ సమయంలో లభించిన ఆనందం వర్ణనాతీతమన్నారు. సినిమా చూస్తున్నంత సేపు దర్శకుడు సందీప్ ఎంతగానో నవ్వుకున్నారని.. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆయనో బీర్ ఓపెన్ చేసి ఇవ్వడం తన కెరీర్‌లో అత్యంత సంతోషకరమైన క్షణమని చెప్పారు. ఆ ఒక్క ఘట్టం తనకు ఒక `ఆస్కార్` అవార్డు అందుకున్నంత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపిన చిత్ర ద‌ర్శ‌కుడు... సరైన కంటెంట్‌ను సృష్టించినప్పుడు లభించే తృప్తి ముందు ఏ అవార్డు అయినా తక్కువేనని విశ్లేషించారు.

Tags:    

Similar News