ఇందుకే ప్రభాస్ నిజమైన 'రాజు'..!
కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్ రాజు కెరీర్ ఆరంభం నుంచి తన మంచితనంను చూపిస్తూ వచ్చాడు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల ఫ్యామిలీకి చెందిన వాడు అనే విషయం అందరికీ తెలిసిందే. కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్ రాజు కెరీర్ ఆరంభం నుంచి తన మంచితనంను చూపిస్తూ వచ్చాడు. హీరోలు మరీ ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని ప్రతి ఒక్కరితో అనిపించుకున్న నిజమైన స్టార్ ప్రభాస్. ఆయన సినిమాల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అంటూ ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు, ఆయనతో వర్క్ చేసిన వారు చెబుతూ ఉంటారు. తనను నమ్ముకున్న వారి కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు, ఎంత వరకు అయినా ఇస్తాడు అనేది గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. తన ఫిట్‌నెస్ ట్రైనర్‌కి ఖరీదైన కారు బహుమానం ఇవ్వడం మొదలుకుని, తన కోసం వర్క్ చేసే పర్సనల్ స్టాఫ్ కి కూడా సమానమైన గౌరవం ఇవ్వడం కేవలం ప్రభాస్‌కి మాత్రమే చెల్లుతుందని అంటారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్....
ఇక ఇండస్ట్రీలో స్టార్‌డం రాగానే చాలా మంది హీరోలు మారి పోతూ ఉంటారు. తమ పద్దతి మారుతుంది, ఇతర హీరోలతో, దర్శక నిర్మాతలతో మాట్లాడే విధానం మారుతుంది. కానీ ప్రభాస్ అందరిలా కాదు. ప్రభాస్ మొదటి సినిమా సమయంలో కో స్టార్స్ కి, మేకర్స్‌కి ఎలా గౌరవం ఇచ్చాడో ఇప్పటికీ అలాగే గౌరవం ఇస్తాడు అనే విషయం ఎంతో మంది చెప్పడం మనం చూశాం. ఇక తన వారు అనుకుంటే వారికి ప్రతి విషయంలోనూ హెల్ప్ చేయడం, అన్ని విధాలుగా వారికి అండగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. తన స్టార్‌డంను పక్కన పెట్టి చిన్న వారి సినిమాల ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రభాస్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో సార్లు ప్రభాస్ ఇంత చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్ చేశాడా అనే చర్చ జరిగిన విషయం తెల్సిందే. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయినా తన అనుకున్న వారి కోసం ఎంత కిందికి అయినా దిగడానికి ప్రభాస్ రెడీగా ఉంటాడని ఎన్నో సార్లు నిరూపితం అయ్యింది.
వర్షం దర్శకుడు శోభన్ కొడుకులు...
ప్రభాస్‌కి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉంటారు. ఏమాత్రం ఈగో లేకుండా ప్రభాస్ అందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటారు. కెరీర్ ఆరంభంలో తనతో వర్క్ చేసిన వారి నుంచి ఈ మధ్య ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారి వరకు అందరితోనూ ప్రభాస్ ఉండే విధంగా చూడముచ్చటగా అనిపిస్తుంది. గోపీచంద్ సినిమా చేస్తే ఆ సినిమా కోసం తనవంతు అన్నట్లుగా ప్రమోషన్ చేస్తాడు. గతంలో తనకు వర్షం వంటి హిట్ ఇచ్చిన శోభన్ కొడుకులు కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి పలు విధాలుగా హెల్ప్ చేసి వారిని కెరీర్ లో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది కూడా ప్రభాస్ అనే విషయం తెల్సిందే. తన స్నేహితులు యూవీ క్రియేషన్ ఏర్పాటు చేసి అందులో తీసే సినిమాలన్నింటికి ప్రభాస్ మద్దతు తెలుపుతూనే ఉంటాడు. కొందరు మొహమాటంతో అడగకున్నా తానే ముందుకు వచ్చి ప్రమోషన్ చేసి, చిన్న సినిమాలకు మంచి క్రియేట్ అయ్యేలా చేసిన ఘనత ప్రభాస్‌కి దక్కుతుంది.
శర్వానంద్ బైకర్ కోసం ప్రభాస్...
తాజాగా ప్రభాస్ 'బైకర్' సినిమా కోసం ముందుకు వచ్చాడు. శర్వానంద్ హీరోగా రూపొందిన బైకర్ సినిమా విడుదలకు ముస్తాబు అయ్యింది. శర్వాతో ఉన్న స్నేహంతో ప్రభాస్ ముందుకు వచ్చి బైకర్ ప్రమోషన్ వీడియో ఒకటి చేయడం జరిగింది. బైక్ పై స్టైల్ గా అలా కూర్చున్న స్టిల్ తో ప్రభాస్ ఒక్కసారిగా బైకర్ మూవీ రేంజ్‌ను పెంచాడు. ఇప్పటికే శర్వానంద్ బైకర్ పై ఉన్న అంచనాలు, ఆసక్తిని ప్రభాస్ పెంచడంతో పాటు, సినిమా స్థాయిని పెంచాడు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. తన సినిమాల ప్రమోషన్స్ కి హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించని ప్రభాస్, ఇతరుల సినిమాలకు తన ప్రజెన్స్ వల్ల లాభం ఉంటుంది అంటే తప్పకుండా ప్రమోషన్‌కి ఓకే చెప్తాడు. కన్నప్పలో గెస్ట్ రోల్, మరికొన్ని వాయిస్ ఓవర్ లు.. ఇలా అన్నింటిని చూస్తే ప్రభాస్ పేరుకు తగ్గట్లుగానే రాజు అంటూ ఆయన అభిమానులు మాత్రమే కాకుండా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.