సంచలన జోడీ మధ్య ఆనాటి కెమిస్ట్రీ!
ఈ రెండు భిన్నమైన నటనా శైలులు ఒకదానికొకటి తోడవడంతో మా మధ్య కెమిస్ట్రీ మరింతగా పండింది. ఆమిర్ పద్ధతి, పూజా స్వేచ్ఛా స్వభావం కలసి సినిమాకు ప్రాణం పోసాయని చెప్పొచ్చు.
బాలీవుడ్ క్లాసిక్ శృంగార చిత్రాలలో 1991లో విడుదలైన `దిల్ హై కే మంతా నహీన్` చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో ఆమిర్ ఖాన్- పూజా భట్ జంట ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా భట్ ఈ చిత్ర నిర్మాణ సమయంలోని తన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ సమయంలో తనకు- ఆమిర్ ఖాన్‌కు మధ్య ఓ విలక్షణమైన స్పార్క్ఉండేదని గుర్తు చేసారు. దశాబ్దాలు గడిచినా ఆ సినిమా అందించిన అనుభూతి.. నటీనటుల మధ్య ఉన్న బంధం నేటికీ సజీవంగానే ఉన్నాయని పేర్కొన్నారు.
ఆ సమయంలో నేను-ఆమిర్ ఖాన్ చాలా చిన్న వయసులో ఉన్నాం. కెరీర్ ప్రారంభ దశలో ఉన్న ఇద్దరు యువ నటీనటుల మధ్య సహజంగానే ఒకరినొకరు అధిగమించాలనే తపన.. అదే సమయంలో పరస్పర గౌరవం ఉండేవన్నారు.
సెట్స్‌పై వ్యక్తిత్వాలు భిన్నంగా ఉన్నా? ఆ వ్యత్యాసాలే తమ మధ్య చక్కని సమతుల్యతను తీసుకువచ్చాయని పూజా గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మా మధ్య ఏర్పడిన ఆ సాన్నిహిత్యమే వెండితెరపై అంతటి అద్భుతమైన ప్రేమకథగా హైలైట్ అయిందన్నారు. ఆమిర్ ఖాన్ అప్పట్లోనే క్రమశిక్షణ.. నటన పట్ల అంకితభావంతో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉండేవారన్నారు. ప్రతి సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం ఆయన శైలి. మరోవైపు పూజా భట్ మరింత సహజంగా అప్పటికప్పుడు వచ్చే హావభావాలతో నటించడానికి ఇష్టపడేవాళ్లం.
ఈ రెండు భిన్నమైన నటనా శైలులు ఒకదానికొకటి తోడవడంతో మా మధ్య కెమిస్ట్రీ మరింతగా పండింది. ఆమిర్ పద్ధతి, పూజా స్వేచ్ఛా స్వభావం కలసి సినిమాకు ప్రాణం పోసాయని చెప్పొచ్చు. ఈ చిత్రానికి పూజా భట్ తండ్రి- ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించడం మరొ విశేషం. నటీనటుల నుండి ఉత్తమమైన నటనను రాబట్టడంలో మహేష్ భట్ సిద్ధహస్తులు. ఆమిర్, పూజాల మధ్య ఉన్న ఆ స్పార్క్ ను ఆయన గుర్తించి.. దాన్ని తెరపై ఆవిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. నటుడిగా భట్ ఇచ్చిన స్వేచ్ఛ కారణంగానే తామిద్దరం ఎలాంటి అపోహలు లేకుండా పాత్రల్లో లీనమై నటించగలిగామని పూజా గుర్తు చేసుకున్నారు.
`దిల్ హై కే మంతా నహీన్` చిత్రంలోని పాటలు, సంభాషణలు నేటికీ ఎంతో సంప్రదాయబద్ధంగా ఆకర్షణీయంగా నిలిచాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌లో వారిద్దరి మధ్య కనిపించే కెమిస్ట్రీ నటన మాత్రమే కాదు. వారి మధ్య ఉన్న నిజమైన స్నేహం, పరస్పర అవగాహన వల్లనే అది సాధ్యమైందని పూజాభట్ అభిప్రాయపడ్డారు. తెర వెనుక వారి మధ్య ఉన్న ఆ స్నేహపూర్వక వాతావరణమే? తెరపై ప్రేక్షకులకు ఒక మరపురాని దృశ్యకావ్యంగా నిలిచింది.
చివరిగా నాటి తరం సినిమాల్లో కనిపించే ఇలాంటి సహజమైన బంధాలు నేటి ఆధునిక చిత్రాల్లో అరుదుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. పూజా భట్ వ్యక్తపరిచిన ఈ భావాలు సినిమా జ్ఞాపకాలు మాత్రమే కావు. అద్భుతమైన కాలానికి ప్రతీకలు. ఆమిర్ ఖాన్‌తో పనిచేసిన ఆ రోజులు తన జీవితంలో ఎప్పటికీ మధురమైనవిగా నిలిచిపోతాయని సంతోషాన్ని వ్యక్తం చేసారు.