'పెద్ది'లో ఐటం సాంగ్ థియేట‌ర్ బ్లాస్టే!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'పెద్ది'.

Update: 2026-05-18 13:07 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం `పెద్ది`. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కోసం మెగా అభి మానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ఓఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు . సినిమాలోని స్పెషల్ సాంగ్ (ఐటెం సాంగ్) పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

`పెద్ది` సినిమాలో స్పెష‌ల్ సాంగ్ థియేటర్లలో ఒక రేంజ్ బ్లాస్ట్‌లా ఉండబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌కు, ఆయన అద్భుతమైన డ్యాన్స్ గ్రేస్‌కు సరిపోయేలా పాటను అత్యంత భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ పాట వెండితెరపై వచ్చేటప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో సీట్లలో కూర్చోలేరని మాస్ ఆడియన్స్‌కు ఇది పక్కా విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంద‌ని బుచ్చిబాబు రివీల్ తో అభిమానుల్లో అంచనాలను తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా క్లాస్, మెలోడీ మెలోడీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రెహమాన్.. ఈ సినిమా కోసం రూట్ మార్చి కంప్లీట్ మాస్ అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. ఈ ఐటెం సాంగ్ కోసం రెహమాన్ ఊరమాస్ బీట్స్ ఇచ్చారని, ఆయన కెరీర్‌లోనే ఇదొక విభిన్నమైన , ఎనర్జిటిక్ సాంగ్ అవుతుందని బుచ్చిబాబు వెల్లడించారు. రెహమాన్ ఇచ్చిన థంపింగ్ బేస్, డ్రమ్స్ వింటేనే తనకు గూస్‌బంప్స్ వచ్చాయని దర్శకుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక గీతం కోసం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో కోట్ల రూపాయల బడ్జెట్‌తో అత్యంత విలాసవంతమైన, రంగులమయమైన భారీ సెట్‌ను నిర్మించినట్లు టాక్ నడుస్తోంది.

రామ్ చరణ్ సరసన పాటలో సందడి చేయబోయే ఆ క్రేజీ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మేకర్స్ ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. అయితే చరణ్ స్పీడ్‌కు మ్యాచ్ అయ్యే రేంజ్‌లో భారీ క్రేజ్ ఉన్న టాప్ గ్లామర్ క్వీన్‌ను సాంగ్ కోసం ఎంపిక చేశారని త్వరలోనే ఆ వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. బుచ్చిబాబు చెప్పిన థియేటర్ బ్లాస్ట్ అప్‌డేట్‌తో ఐటెం సాంగ్‌పై మెగా ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఏఆర్ రెహమాన్ మార్క్ మాస్ మ్యాజిక్ -రామ్ చరణ్ డ్యాన్స్ విధ్వంసం ఒకేసారి స్క్రీన్ పై పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.

Tags:    

Similar News