ఏప్రిల్ 30- జూన్ 25 మధ్యలో తారక్ దిగిపోతాడా?
అప్పుడప్పుడు అగ్ర హీరోల చిత్రాల విడుదల తేదీల విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంటుంది.;
అప్పుడప్పుడు అగ్ర హీరోల చిత్రాల విడుదల తేదీల విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంటుంది. అందుకు కారణాలు రకరకాలు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా ముందుగా పూర్తి కాకపోవడం లేదా చివరి నిమిషంలో సెన్సార్ ఇబ్బందులు సహా పలు కారణాలతో రిలీజ్ లు వాయిదా పడుతుంటాయి. కొన్నిసార్లు సెట్స్ లో ఉండగానే వాయిదా వార్తలు తెరపైకి వస్తుంటాయి. మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన రామ్ చరణ్ సినిమా `పెద్ది` విష యంలో ఎలాంటి గందరగోళం నెలకొందో తెలిసిందే. మార్చి నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది.
తాజాగా ఆతేదీన నుంచి జూన్ 25 కి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ పై స్పష్టత లేకపోవడంతో మిగతా సినిమా రిలీజ్ లు గందరగోళంగా మారుతుంది. ఏప్రిల్ నుంచి రిలీజ్ కు అనుకూలమైన తేదీలున్నాయి. ఈ క్రమంలో చాలా సినిమాలు రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ కాబట్టి అదే రైట్ టైమ్ గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ గ్యాప్‌ను భర్తీ చేసే క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు రావడం చరణ్ సినిమా వాయిదా పడుతుందనే వార్తల నేపథ్యంలో ఏప్రిల్ 30- జూన్ 25 మధ్యలో ఎన్టీఆర్ దిగిపోయే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ఈ రేసులోకి వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం. జూన్ 25న సినిమా రిలీజ్ అవుతుందనే హింట్ కూడా అందిన వేళ రిలీజ్ తేదీ ముందుకొచ్చే అవకాశాలున్నాయి. కానీ అందత వీజీ కూడా కాదు.
ప్రశాంత్ నీల్ సినిమాలంటే భారీ విజువల్ ఎఫెక్ట్స్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఏప్రిల్ నాటికి సినిమాను సిద్ధం చేయడం సాధ్యమేనా? అన్న దానిపై అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ? ఏప్రిల్ 30 - జూన్ 25 మధ్య కాలంలో `డ్రాగన్` రిలీజ్ టాపిక్ అయితే నడుస్తుంది.`పెద్ది` రిలీజ్ కన్పామ్ అయ్యే వరకూ ఈ చర్చ సోషల్ మీడియాలో ఆగదు. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ విడుదల తేదీల రచ్చకు ఫుల్ స్టాప్ పడదు. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోలు ఎప్పుడు వెండితెరపై కనిపిస్తారా? అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.