నార్త్ అమెరికాలో 'పెద్ది'.. స్పీడ్ మామూలుగా లేదు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో హైప్‌ ను సొంతం చేసుకుంటోంది.

Update: 2026-05-29 04:54 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ లో ఓ రేంజ్ లో హైప్‌ ను సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌ లో ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ చిత్రం, ప్రీమియర్ షోల ద్వారానే భారీ వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.




 


మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం, పెద్ది నార్త్ అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ రూపంలో ఇప్పటికే 5 లక్షల 75 వేల డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇంకా విడుదలకు కొన్ని రోజులు ఉండగానే ఆ రేంజ్ లో బుకింగ్స్ జరగడం విశేషం. ఇప్పటి వరకు 22,500కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని మేకర్స్ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మాస్సా మాస్సా మాస్సా అంటూ పోస్ట్ చేసి.. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలకు ఎప్పటి నుంచో మంచి మార్కెట్ ఉంది. అయితే స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రావడం ఇప్పుడు సాధారణంగా మారింది. కానీ పెద్ది విషయంలో కనిపిస్తున్న రెస్పాన్స్ మాత్రం వేరే స్థాయిలో ఉందని సినీ ప్రియులు చెబుతున్నారు. ముఖ్యంగా చరణ్ కు గత చిత్రాల తర్వాత వచ్చిన క్రేజ్.. పెద్ది సినిమాకు బాగా యూజ్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇటీవల రిలీజ్ చేసిన హల్లాల్ల్లో సాంగ్‌ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎమోషన్స్‌ తో కూడిన కథతో సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ తో సందడి చేయనున్నారు.

ఇక చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. జగపతిబాబు, దివ్యేందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీత బాధ్యతలు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నిర్వహిస్తుండటం కూడా సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది.

సినిమాటోగ్రఫీ రత్నవేలు అందిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి చేపట్టారు. సాంగ్స్ ను జానీ మాస్టర్ కంపోజ్ చేశారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఏదేమైనా ఓవర్సీస్ లో ఇదే స్పీడ్ కొనసాగితే విడుదలకు ముందే పెద్ది నార్త్ అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్‌ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో.. బాక్సాఫీస్ వద్ద ఎంతటి వసూళ్లు సాధిస్తుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News