పెద్ది ప్లానింగ్.. వేరే లెవెల్!
ఇక మంచి క్రేజున్న కొత్త సినిమాలు రిలీజైనపుడు పనిగట్టుకుని కొన్ని బ్యాచులు నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం మామూలే. ఫ్యాన్ వార్స్‌లో భాగంగా ఇవి జరుగుతుంటాయి.
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ‘పెద్ది’ సినిమా ప్రమోషన్లకు సంబంధించి.. కొన్ని రోజుల ముందు వరకు టీంలో పెద్దగా కదలిక లేదంటూ మెగా ఫ్యాన్స్ చాలా ఫీలవుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రమోషన్ మరీ ఎక్కువైపోతోందేమో అనుకునే రేంజిలో టీం ప్లానింగ్ ఉంటోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇంకోవైపు చిత్ర బృందంలోని ముఖ్యులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ కూడా హోరెత్తిపోతోంది.
దీనికి తోడు రిలీజ్ టైంలో ఆన్ లైన్ యాక్టివిటీస్ వల్ల సినిమాకు ఏ రకంగానూ నష్టం జరగకుండానూ టీం జాగ్రత్త పడుతోంది. ఈ చిత్రాన్ని పైరసీ చేయకుండా మద్రాస్ హైకోర్టు నుంచి ప్రత్యేకంగా ఆదేశాలు తెచ్చుకుంది చిత్ర బృందం. పైరసీ వెర్షన్ అప్‌లోడ్ చేసిన వెబ్ సైట్‌ను వెంటనే బ్లాక్ చేసేలా ఈ ఆర్డర్ ఉపయోగపడనుంది. దీని వల్ల పైరసీ ఆగిపోతుందని చెప్పలేం కానీ.. ఎంతో కొంత నియంత్రించడానికి అవకాశమున్నట్లే.
ఇక మంచి క్రేజున్న కొత్త సినిమాలు రిలీజైనపుడు పనిగట్టుకుని కొన్ని బ్యాచులు నెగెటివిటీని స్ప్రెడ్ చేయడం మామూలే. ఫ్యాన్ వార్స్‌లో భాగంగా ఇవి జరుగుతుంటాయి. ఒక హీరో అభిమానులు ఇంకో హీరో సినిమా రిలీజైనపుడు డ్యూటీ చేస్తే.. ఆ వర్గం ఈ హీరో సినిమా విడుదల సమయంలో రంగంలోకి దిగుతాయి.
సినిమాలో జెన్యూన్‌గా లోపాలు వెతికితే ఓకే కానీ.. కావాలనే దుష్ప్రచారం చేస్తే మాత్రం డ్యామేజ్ జరుగుతుంటుంది. ఐతే ‘పెద్ది’కి ఈ రకంగా నష్టం జరగకుండా టీం ముందే జాగ్రత్తపడింది. ఇలా పనిగట్టుకుని ‘పెద్ది’ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి కేసులు పెడుతోంది. ఇప్పటికే ఇలా ఇద్దరిపై ఆధారాలు సమర్పించి కేసులు పెట్టింది టీం.
ఇలా ‘పెద్ది’ని జనంలోకి తీసుకెళ్లేందుకు ఓవైపు ప్రమోషన్ల పరంగా ఏం చేయాలో అన్నీ చేస్తూనే.. దానికి ఏ రకమైన నష్టం జరగకుండానూ చర్యలు చేపడుతోంది టీం. పైరసీని ఆపడంలో, నెగెటివిటీని అడ్డుకోవడంలో ఇలాంటి చర్యల వల్ల ఫలితం ఉంటే.. మున్ముందు అన్ని పేరున్న సినిమాల మేకర్స్ ఈ పద్ధతినే అనుసరిస్తారనడంలో సందేహం లేదు.