పెద్ది సెట్స్ లో రామ్ చరణ్.. డైరెక్టర్ ఆటిట్యూడ్ పై జాన్వీ కామెంట్స్!
షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో వివరిస్తున్నప్పుడు చరణ్ చాలా ప్రశాంతంగా వినేవారని, ఆ సమయంలో తానే కొంచెం టెన్షన్ పడేదాన్నని గుర్తుచేసుకున్నారు.
జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ లో నటీనటులు అందరూ కూడా టైమ్ కెటయించి మరి సినిమాను ప్రమోట్ చేస్తుండడం విశేషం. చూస్తుంటే పెద్ది పెద్ద నగరాల్లో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకునేలా కనిపిస్తోంది. ఇక లేటెస్ట్ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా మెయిన్ స్టార్ క్యాస్ట్ అందరూ కనిపించారు. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడిన విధానం కూడా ఆకట్టుకుంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని, అలాగే తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. సెట్స్ లో రామ్ చరణ్ ప్రవర్తన చూసి తాను చాలా విషయాలు తెలుసుకున్నానని ఆమె చెప్పారు. రామ్ చరణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ చాలా అద్భుతంగా సాగిందని జాన్వీ వెల్లడించారు. ట్రైలర్ లో కనిపించే ఆ రౌడీతనం, మాస్ ఆటిట్యూడ్ చరణ్ లో నిజ జీవితంలో అస్సలు ఉండదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో వివరిస్తున్నప్పుడు చరణ్ చాలా ప్రశాంతంగా వినేవారని, ఆ సమయంలో తానే కొంచెం టెన్షన్ పడేదాన్నని గుర్తుచేసుకున్నారు. ఆఫ్ కెమెరా చాలా సైలెంట్ గా ఉంటూ తన ఎనర్జీని దాచుకునే చరణ్, కెమెరా ఆన్ కాగానే స్క్రీన్ మీద ఒక్కసారిగా ఎక్స్ ప్లోసివ్ ఎనర్జీతో రెచ్చిపోతారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక నటుడిగా ఆయనకు ఉన్న ఈ ప్రత్యేకమైన శైలి వల్లే సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయని చెప్పారు.
చరణ్ లోని ఈ సరికొత్త యాంగిల్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుందని జాన్వీ నమ్మకంగా తెలిపారు. ఇక ఈ సినిమాలో తన లుక్, క్యారెక్టర్ చాలా కొత్తగా, బోల్డ్ గా ఉండబోతున్నట్లు జాన్వీ తెలిపారు. ఇందులో ఒక రౌడీ తరహా పాత్రను తాను పోషించానని చెప్పారు. ఈ క్యారెక్టర్ కోసం తాను పెద్దగా ప్రిపరేషన్లు ఏమీ అవ్వలేదని, కేవలం దర్శకుడు బుచ్చిబాబు సన ఆటిట్యూడ్ ను మాత్రమే ఫాలో అయ్యానని ఆమె ఓపెన్ గా చెప్పారు.
బుచ్చిబాబు సన చూడ్డానికైతే చాలా చిన్నగా, సాదాసీదాగా, గప్ చుప్ గా ఉంటారు కానీ ఆయన లోపల ఒక రకమైన స్టైలిష్ ఆటిట్యూడ్ దాగి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్ సమయంలో తాను కేవలం దర్శకుడిని మాత్రమే కాపీ చేస్తూ తన పాత్రను పండించానని జాన్వీ వివరించారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ది చిత్ర యూనిట్ లో ఉన్న మేమందరం కూడా బుచ్చిబాబు సనకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయామని ఆమె నవ్వుతూ వెల్లడించారు. ఇక జాన్వీ పెద్ది సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి.