`ఓజీ 2` లో ఛాన్స్ ఇవ్వ‌డం లేదా?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజీత్ దర్శకత్వంలో `ఓజీ 2` కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-07-19 04:29 GMT

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా సుజీత్ దర్శకత్వంలో `ఓజీ 2` కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. `ఓజీ`కి కొన‌సాగింపుగా రెండ‌వ భాగాన్ని ప‌ట్టాలెక్కిస్తున్నారు. దీంతో దాదాపు మొద‌టి భాగంలో ఉన్న పాత్ర‌ల‌న్నీ రెండ‌వ భాగంలోనూ క‌నిపించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుకున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయన స్థానంలో మరొక నటుడిని తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తున్న‌ట్లు వినిపిస్తోంది.

`ఓజీ` చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. అయితే `ఓజీ 2` కథాంశంలో దర్శకుడు సుజీత్ తీసుకున్న కొన్ని కీలక మార్పుల వల్ల ఆ పాత్ర స్వభావాన్ని మారుస్తున్నట్లు సమాచారం. కథ గమనాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త నటుడితో ఆ పాత్రను మరింత ప్రభావవంతంగా చూపించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రకాష్ రాజ్ పాత్రను కొనసాగించడం కంటే? కొత్త నటుడిని తీసుకురావడమే సరైన నిర్ణయమని చిత్రబృందం భావించినట్లుగా వినిపిస్తోంది.

ప్రకాష్ రాజ్ వంటి అగ్రశ్రేణి నటుడిని తొలగించడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఇప్పటికే `ఓజీ` మొదటి భాగంపై భారీ అంచనాలు ఉండగా? ఇప్పుడు ఇలాంటి కీలక మార్పులు సినిమా నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అభిమానులు ఆందోళన చెందే అవ‌కాశం ఉంది. ఇది కేవలం క్రియేటివ్ నిర్ణయమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అన్నది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఏ చిత్రానికైనా కథలో మార్పులు చేయడం సహజమేనని ఈ మార్పును అవ‌స‌రం మేర చేస్తున్నార‌ని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న `ఓజీ 2`లో ప్రతి పాత్ర అత్యంత కీలకం కాబట్టి కథ డిమాండ్ మేరకు నటీనటుల ఎంపిక ఉంటుందని సమర్థించుకుంటున్నారు. కథా దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమవుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ప్రకాష్ రాజ్ స్థానంలో ఏ నటుడు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు సీనియర్ నటుల పేర్లు తెరపైకి వస్తున్నా? మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ సరసన లేదా ఆయనకు ప్రత్యర్థిగా కనిపించే పాత్ర కోసం ఎంపిక చేయబోయే నటుడు సినిమాకు ఎంతవరకు అదనపు బలాన్ని ఇస్తాడనేది చూడాలి. సుజీత్ మేకింగ్ స్టైల్ కి తగ్గట్టుగా ఉండబోయే ఆ నటుడి ఎంపిక కోసం పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

`ఓజీ 2` షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. నటుల మార్పులు, సాంకేతిక మార్పులు అన్నీ పూర్తయ్యాక అనుకున్న సమయానికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా? ప్రకాష్ రాజ్ వంటి నటుడిని తప్పించడం నిజ‌మే అయితే అదొక పెద్ద నిర్ణయమే. ఈ మార్పు ఓజీ ఫ్రాంచైజీకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News