పవన్‌ OG-2.. అసలు విషయం ఇదే!

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి ఈ మధ్య కాలంలో ఫుల్‌ కిక్ ఇచ్చిన మూవీ అంటే 'OG' అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Update: 2026-05-17 14:30 GMT

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి ఈ మధ్య కాలంలో ఫుల్‌ కిక్ ఇచ్చిన మూవీ అంటే 'OG' అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యాన్స్‌ కోసం అన్నట్లుగా ఈ సినిమాను దర్శకుడు సుజీత్‌ రూపొందించాడు. అంతకు ముందు, ఆ తర్వాత వచ్చిన పవన్‌ కళ్యాణ్ సినిమాలతో పోల్చితే ఓజీ సినిమా ఫ్యాన్స్‌కి ఫుల్‌ కిక్‌ ఇచ్చింది. అంతే కాకుండా పవన్‌ కళ్యాణ్‌ ను ఫ్యాన్స్‌ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు అనడంలో సందేహం లేదు. కథ, కథనం ఇతర విషయాలతో సంబంధం లేకుండా దర్శకుడు సుజీత్‌ ఓజీను కేవలం ఫ్యాన్స్‌ షో అన్నట్లుగా నడిపిన తీరుకు ప్రతి ఫ్యాన్‌ ఫిదా అయ్యాడు. పవన్‌ ను ఇలా చూడాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నామని, సుజీత్‌ కి థాంక్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున పోస్ట్‌లు షేర్ చేసిన విషయం తెల్సిందే.

ది ప్యారడైజ్‌ మూవీ షూటింగ్‌...

ఓజీ సినిమా కంటే ముందు నాని హీరోగా సుజీత్‌ ఒక సినిమాను చేయాల్సి ఉంది. షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో పవన్‌ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చిందట. దాంతో నానితో చెప్పి సుజీత్‌ 'ఓజీ' సినిమాను మొదలు పెట్టాడు. ఓజీ సినిమా పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల చాలా ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఓజీ విడుదలైంది, సూపర్‌ హిట్‌ అయ్యింది.. ఇక నాని సినిమా మొదలు అనుకుంటున్న సమయంలో సుజీత్‌ కి పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం నాని తన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ 'ది ప్యారడైజ్‌' షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా అద్భుతంగా వస్తుందని మేకర్స్ అంటున్నారు. ఆ సినిమా కోసం నాని ఇతర ప్రాజెక్ట్‌లు అన్నీ పక్కన పెట్టాడు. ది ప్యారడైజ్ మూవీ విడుదల అయ్యే వరకు నాని కొత్త సినిమాను మొదలు పెట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ ఓజీ మూవీ....

నాని ఆ సినిమాతో బిజీగా ఉన్న కారణంగా దర్శకుడు సుజీత్‌ మళ్లీ ఖాళీ అయ్యాడు. దాంతో సుజీత్‌ ఈ సమయంను ఓజీ సీక్వెల్‌ పై పెట్టాడనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సీక్వెల్‌ కోసం మంచి కథతో వస్తే తప్పకుండా చేద్దాం అని పవన్‌ కళ్యాణ్ స్వయంగా సుజీత్‌కి హామీ ఇచ్చాడట. ఆ హామీని పవన్‌ కచ్చితంగా నిలబెట్టుకుంటాడనే విశ్వాసం ఉంది. అందుకే సుజీత్‌ మళ్లీ నాని సినిమా పనులను పక్కన పెట్టి మరీ ఓజీ సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ అధికారికంగా రాలేదు. కానీ ఫ్యాన్స్ ఈ రూమర్స్‌కి పిచ్చెక్కి పోతున్నారు. సినిమా కథకు కొనసాగింపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఓజీ సీక్వెల్‌ చేస్తే సెట్‌ అవుతుందనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు.

సుజీత్‌ దర్శకత్వంలో ఓజీ 2...

పవన్‌ కళ్యాణ్‌ హీరోయిజంను ఎలివేట్‌ చేయడంలో దర్శకుడు సుజీత్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. అందుకే ఓజీ 2 వస్తే అంతకు మించి అన్నట్లుగా పవన్‌ కళ్యాణ్‌ విజువల్స్ పడే అవకాశం ఉంది. అదే జరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ప్యాన్స్‌ డబుల్‌ హ్యాపీ కావడం ఖాయం. అందుకే సుజీత్‌ ఓజీ 2 సినిమా కోసం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాడనే వార్తలు వచ్చిన వెంటనే అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చ మొదలు పెట్టారు. ఓజీ సినిమా ఫ్యాన్స్‌ కోసం అన్నట్లుగా రూపొందించిన సుజీత్‌ ఈసారి ఫ్యాన్స్‌ తో పాటు రెగ్యులర్‌ ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగా చేస్తాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అయితే నానితో చేయాల్సిన బ్లడీ రోమియో పూర్తి చేసిన తర్వాతే పవన్‌ కళ్యాణ్ మూవీ మొదలు పెట్టే అవకాశం ఉంది. అంటే ది ప్యారడైజ్‌ మూవీ పూర్తి అయ్యి విడుదల కావాల్సి ఉంది, ఆ తర్వాత నాని, సుజీత్‌ కాంబో మూవీ ప్రారంభం కావాలి, ఆ తర్వాత సినిమా విడుదల అవ్వాలి. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ తో ఓజీ 2 సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు పవన్‌ సినిమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా చూడాల్సి ఉంటుంది.

Tags:    

Similar News