గురూజీ పాన్ ఇండియా సినిమాకు 'అ'!

త్రివిక్రమ్ సెంటిమెంట్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పనవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా టైటిల్ .. ప్రచార విషయాల్లో కొన్ని సెంటిమెంట్లు బలంగా పాతుకుపోయి ఉంటాయి.

Update: 2026-07-26 17:30 GMT

త్రివిక్రమ్ సెంటిమెంట్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పనవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా టైటిల్ .. ప్రచార విషయాల్లో కొన్ని సెంటిమెంట్లు బలంగా పాతుకుపోయి ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాలలో `అ` అక్షరంతో మొదలయ్యే టైటిల్స్‌కు ఉండే క్రేజే వేరు. `అతడు`, `అత్తారింటికి దారేది`, `అరవింద సమేత వీర రాఘవ`, `అల వైకుంఠ‌పుర‌ములో`, `అఆ` వంటి పలు విజయవంతమైన చిత్రాలు 'అ' అక్షరంతోనే ప్రారంభమై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సాధించాయి. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న పాన్-ఇండియా చిత్రంపై పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్‌తో ఆయన చేయబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కూడా సెంటిమెంట్ ప్రకారం `అ` అక్షరంతో కూడిన టైటిల్ పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సాధారణ సినిమాలే కాకుండా ?భారీ బడ్జెట్ తో తెరకెక్కే పాన్-ఇండియా స్థాయి చిత్రాలకు కూడా ఈ సెంటిమెంట్లు వర్తిస్తాయా? అనే కోణంలో ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో .. సినీ వర్గాలలో సినిమా టైటిల్‌కు సంబంధించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. `గాడ్ ఆఫ్ వార్` అనే టైటిల్ పరిశీలనలో ఉంద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. టైటిల్ వింటుంటేనే? హై-యాక్షన్ పవర్-ప్యాక్డ్ డ్రామాతో ఉండబోతుందో స్పష్టమవుతోంది.

అయితే ఇది నిజమైన టైటిలా లేక సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. త్రివిక్రమ్ సెంటిమెంట్ అయిన `అ` అక్షరం వైపు మొగ్గు చూపుతారా? లేక పాన్-ఇండియా మార్కెట్ .. గ్లోబల్ ఆడి యెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని `గాడ్ ఆఫ్ వార్` లాంటి ఇంగ్లీష్ లేదా క్యాచీ టైటిల్‌ను ఫైనల్ చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, త్రివిక్రమ్ మాటల తూటాలు రెండూ కలిసే ప్రాజెక్ట్‌పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. టైటిల్ విషయంలో దర్శకుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది? అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

గతంలో ఇద్ద‌రి కలయికలో వచ్చిన `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం `అ` అక్షరంతోనే వచ్చి ఘన విజయం సాధించింది. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్న పాన్-ఇండియా సినిమాకు కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తారనే వాదన బ‌లంగానే వినిపిస్తోంది. కానీ మారుతున్న కాలానికి తగినట్లుగా గ్లోబల్ అప్పీల్ ఉండే టైటిల్స్ అవసరం కాబట్టి సెంటిమెంట్‌ను పక్కనపెట్టి `గాడ్ ఆఫ్ వార్` తరహా మోడ్రన్ టైటిల్‌ను ఎంచుకునే అవకాశాలు కూడా మెండుగానే క‌నిపిస్తున్నాయి.

`ముర‌గ‌న్` అనే టైటిల్ కూడా వినిపించింది. కానీ అదే టైటిల్ తో త‌మిళ్ లో ఓ సినిమా తెర‌కెక్కుతుంది. పైగా ఈ టైటిల్ అంత క్యాచీగానూ లేదు. కాబ‌ట్టి `ముర‌గ‌న్` టైటిల్ ఛాన్స్ తీసుకునే అవ‌కాశం లేద‌ని చాలా మంది భావి స్తున్నారు. ఈ క‌థ పూర్తిగా కార్తికేయ స్వామి నేప‌థ్యంలో సాగుతుంది. త్రివిక్ర‌మ్ టైటిల్స్ కూడా క‌థ ఆధారంగానే ఉంటాయి. మ‌రి ఈ పాన్ ఇండియా సినిమాకు ఎలాంటి టైటిల్ నిర్ణ‌యిస్తారో చూడాలి.

Tags:    

Similar News