డ్రాగన్.. డౌట్స్ అక్కర్లేదు..
ఎన్టీఆర్ పాల్గొనాల్సిన సీన్స్‌ను తర్వాతికి మార్చాల్సి రావడంతో షూటింగ్ టైమ్‌లైన్‌పై సందేహాలు పెరిగాయి.
ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరిగిన తర్వాత ‘డ్రాగన్’ షూటింగ్ ఏం అవుతుందనే అనుమానాలు వచ్చాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సినిమా కావడంతో 2027 జూన్ 11 డేట్ కూడా మారుతుందనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు మైత్రీ రవి దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘ఇరుముడి’ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ మరో రెండు వారాల్లో షూటింగ్ మొదలవుతుందని, ఆ తర్వాత కంటిన్యూగా వర్క్ చేసి ఫిబ్రవరిలో మొత్తం షూట్ పూర్తి చేస్తామని చెప్పారు.
ఎన్టీఆర్ జూలై 27న భుజానికి గాయపడగా, ఆగస్టులో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. వైద్యులు కొన్ని వారాల విశ్రాంతి సూచించారు. దాంతో అప్పట్లో ప్లాన్ చేసిన శ్రీలంక షెడ్యూల్ కూడా ఆగిపోయింది. ఎన్టీఆర్ పాల్గొనాల్సిన సీన్స్‌ను తర్వాతికి మార్చాల్సి రావడంతో షూటింగ్ టైమ్‌లైన్‌పై సందేహాలు పెరిగాయి. ఇప్పుడు చెప్పిన రెండు వారాల లెక్క చూస్తే రికవరీకి తర్వాతే టీమ్ మళ్లీ సెట్స్‌కు వెళ్లే ప్లాన్‌లో ఉంది.
‘డ్రాగన్’కు రిలీజ్ వాయిదా ఇదే మొదటిసారి కాదు. మొదట సంక్రాంతి 2026కు ప్లాన్ చేసిన సినిమాను తర్వాత జూన్ 25కు మార్చారు. షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో చివరకు 2027 జూన్ 11 అని న్యూ డేట్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు డేట్ మారిన నేపథ్యంలో ఎన్టీఆర్ సర్జరీ తర్వాత మరోసారి వాయిదా పడుతుందా అనే డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు మైత్రీ రవి ఇచ్చిన అప్డేట్‌తో ఆ డౌట్స్‌కు క్లారిటీ వచ్చింది. అనుకున్నట్లే ప్లాన్ కు తగ్గట్టుగా ఆ తేదీకి రిలీజ్ చేస్తామని అన్నారు.
ఫిబ్రవరిలో షూట్ పూర్తైతే రిలీజ్‌కు ముందు దాదాపు మూడు నెలలకు పైగా సమయం ఉంటుంది. అది పోస్ట్ ప్రొడక్షన్‌కు ఉపయోగపడుతుంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఫినిషింగ్‌కు ఎక్కువ పని ఉంటుంది. పైగా కంటిన్యు షూట్ అని రవి చెప్పడం చూస్తే చిన్న చిన్న షెడ్యూల్స్‌గా లాగకుండా, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పెండింగ్ పని ఒక ఫ్లోలో పూర్తి చేయాలనే ప్లాన్ కనిపిస్తోంది.
ఇప్పటికే ‘డ్రాగన్’లో మేజర్ షూట్ షూట్ పూర్తయినట్టు గతంలో వార్తలు వచ్చాయి. జోర్డాన్‌లో కీలక ఎపిసోడ్స్ కూడా తీశారు. రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, బిజు మీనన్ సహా పెద్ద కాస్ట్ ఇందులో ఉంది. 1967 నేపథ్యంతో సాగే కథలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఎన్టీఆర్ సెట్స్‌కు తిరిగి వచ్చిన వెంటనే టీమ్‌కు మరో ప్లాన్ మొదలవుతుంది. ఫిబ్రవరి వరకు షూటింగ్ నడిస్తే మార్చి నుంచి ట్రైలర్, పాటలు, రిలీజ్ ప్రమోషన్స్ కోసం విడిగా సమయం దొరుకుతుంది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే అనుకున్న డేట్ కు రావడం పక్కా.