స్వయంభూ.. పాత్ర కోసం ప్రాణం పెట్టిన నిఖిల్

టాలీవుడ్ లో ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ డ్రామాలకు మంచి క్రేజ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి యంగ్ హీరోలు కూడా భారీ రిస్క్ చేస్తున్నారు.

Update: 2026-06-01 16:10 GMT

టాలీవుడ్ లో ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ డ్రామాలకు మంచి క్రేజ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి యంగ్ హీరోలు కూడా భారీ రిస్క్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒక పెద్ద సినిమాతో సిద్ధమవుతున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభూ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ గ్లింప్స్ బయటకు వచ్చింది. ఇక ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.

ఇదివరకే వచ్చిన రారా దీవర సాంగ్ మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఇక.ఇప్పుడు కృష్ణన్ రామన్ అనే యోధుడి పాత్రలో ఒదిగిపోవడానికి నిఖిల్ పడిన కష్టం లేటెస్ట్ వీడియోలో పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. తెర వెనుక జరిగిన 45 రోజుల కఠోర శిక్షణను ఇందులో అద్భుతంగా చూపించారు. మార్షల్ ఆర్ట్స్, కత్తిసాము లాంటి విద్యల్లో నిఖిల్ ట్రైనింగ్ తీసుకున్న తీరు ఆకట్టుకుంటోంది. నెలల తరబడి చెమటోడ్చి ఒక పవర్ ఫుల్ వారియర్ లా ఎలా మారాడో ఈ స్పెషల్ వీడియో ద్వారా మేకర్స్ రివీల్ చేశారు. పాత్ర కోసం ప్రాణం పెడుతున్న తీరు ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది.

ప్రాక్టీస్ సెషన్స్ తర్వాత నేరుగా యుద్ధంలో శత్రువుల మీదకు దూసుకెళ్లే ఫైనల్ షాట్ ఈ వీడియోకి హైలైట్ గా నిలిచింది. ధైర్యం, అలుపెరగని పోరాట పటిమ కలగలిపిన క్యారెక్టర్ లో నిఖిల్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. భారీ రథం చక్రాన్ని పైకెత్తి పట్టుకున్న పోస్టర్ కూడా బాగా హైలెట్ అవుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కండలు తిరిగిన దేహంతో ఇచ్చిన ఈ మేకోవర్ సినిమా మీద హైప్ ని మరింత పెంచుతుందని చెప్పవచ్చు.

ఇక సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టెక్నికల్ గా కూడా ఈ మూవీ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోందని గ్లింప్స్ తో క్లారిటీ వచ్చేసింది. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమా విజువల్స్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లను సిల్వా మాస్టర్, కింగ్ సోలమన్ డిజైన్ చేస్తున్నారు.

ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ ప్రాజెక్ట్ ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారని అర్థమవుతోంది. ఇక ఈ పీరియడ్ డ్రామా రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ పుట్టినరోజు స్పెషల్ వీడియోతో సినిమాపై సరైన బజ్ క్రియేట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయింది. తెర వెనుక పడిన ఈ కష్టం తెర మీద కూడా అదే రేంజ్ లో వర్కౌట్ అయితే, బాక్సాఫీస్ దగ్గర స్వయంభూ గట్టి ఇంపాక్ట్ చూపించడం ఖాయం.


Full View


Tags:    

Similar News