విశ్వక్‌తో షార్ట్ ఫిల్మ్ ఆగిపోవడమే మంచిదైందట!
పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై విభిన్నమైన సినిమాలు నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు కొణిదెల నిహారిక.;
పింక్ ఎలిఫెంట్ బ్యానర్‌పై విభిన్నమైన సినిమాలు నిర్మిస్తూ అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు కొణిదెల నిహారిక. నటకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రొడ్యూసర్‌గా వరుస సినిమాలని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా `కమిటీ కుర్రోళ్లు`తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిహారిక ప్రస్తుతం సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా `రాకాస` చిత్రాన్ని నిర్మించింది. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
తాను నిర్మించే సినిమాలపై కొందరు విమర్శలు చేస్తూనే ఉంటారని, అందుకే తాను అలాంటి వారిని పట్టించుకోవడం మాసేసినట్టు తెలిపింది. అయితే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా తాను చేసేది మాత్రం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనపై వచ్చే విమర్శలపై తనస్టైల్లో స్పందించిన నిహారిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌తో చేసిన షార్ట్ ఫిలిం గురించి వెల్లడించి షాక్ ఇచ్చింది.
విశ్వక్‌సేన్ హీరోగా పరిచయం కావడానికి ముందు ఆర్టిస్ట్ కావాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాడు. జగపతిబాబు హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన `బంగారు బాబు`లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విశ్వక్ సేన్ `వెళ్లిపోమాకే` మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. అత్యంత తక్కువ బడ్జెట్‌లో నిర్మించిన ఈ మూవీని రిలీజ్ చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నించి చివరికి దిల్ రాజు ద్వారా రిలీజ్ చేయాల్సి వచ్చింది.
అయితే ఈ సినిమాకు ముందు విశ్వక్‌సేన్ ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ఇందులో ఫిమేల్ లీడ్‌గా నిహారిక నటించింది. షూటింగ్ మొదలైంది. ఒక పాట కూడా షూట్ చేశారు. అందులో విశ్వక్ చాలా బిడియస్తుడి క్యారెక్టర్ చేస్తే నిహారిక అతన్ని ఏడిపించే క్యారెక్టర్‌లో కనిపించింది. ఈ షార్ట్ ఫిల్మ్‌ని పాట షూట్ తరువాత ఆపేశారట. ఈ విషయాన్ని నిహారిక కొణిదెల వెల్లడించింది.
విశ్వక్‌కు నాకు జరిగిన మంచి విషయం అది. ఒక్క పాటతో షార్ట్ ఫిల్మ్‌ని ఆపేశారు. మీడియా అప్పట్లో అంత లేదు. మనం ఏది చేసినా అప్పట్లో ఫ్రీగా చేశాం. ఇప్పుడు అనిపిస్తుంది నాకు..అప్పట్లో మీడియా ఉంటే అలాంటి షార్ట్ ఫిల్మ్స్ నేను చేసేదాన్ని కాదు కదా? అని. దేవుడి దయ వల్ల ఒక్క పాటతో ఆ షార్ట్ ఫిల్మ్ ఆగిపోయింది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ చేసే టైమ్‌లో నేను చాలా ఎంజాయ్ చేశాను. డైరెక్టర్ విశ్వక్‌కు నాకు కామన్ ఫ్రెండ్ అలా ఇద్దరం కలిసి షార్ట్ ఫిలిం చేయాలనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల అది జరగలేదు అంటూ దండం పెట్టింది.
ఈ వీడియోలో మీరు డామినేటింగ్‌గా ఉంటే విశ్వక్ సిగ్గు పడుతూ కనిపించడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోందని అడిగితే క్రింజ్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై విశ్వక్ ఎలా స్పందిస్తాడో చూడాలి.