NBK111 : దాచి ఉంచిన ఆ సర్‌ప్రైజ్ ఏంటో?
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. రెండు మూడు టైటిల్స్ ను దర్శకుడు పరిశీలిస్తున్నాడు. రెండు అక్షరాల పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసేందుకు గాను దర్శకుడు గోపీచంద్ మలినేని చర్చలు జరుపుతున్నాడు అనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి సెప్టెంబర్ 6న సర్‌ప్రైజ్ రివీల్ చేయబోతున్నట్లుగా స్టైలిష్ వీడియోను షేర్ చేసి మరీ ప్రకటించారు. బాలకృష్ణ సిగర్ వెలిగించి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
NBK111 టైటిల్ రివీల్...
సెప్టెంబర్ 6న సినిమా గురించి రివీల్ చేయబోతున్న ఆ సీక్రెట్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుంది. మరో వైపు సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ముందుగా అనుకున్న ప్రకారం సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ బాలకృష్ణకు షూటింగ్‌లో యాక్సిడెంట్ అయిన కారణంగా షూటింగ్ వాయిదా పడింది. బాలకృష్ణ పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే షూటింగ్ పునఃప్రారంభించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని భావించాడు. అందుకే ఇన్ని రోజులు బాలయ్య కు పూర్తి విశ్రాంతిని ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 6న సినిమా షూటింగ్‌కి బాలయ్య జాయిన్ కాబోతున్నాడేమో అని కూడా కొందరు మాట్లాడుతున్నారు.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో...
మొత్తానికి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 6న ఏ సర్‌ప్రైజ్ వచ్చినా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ రోజు టైటిల్‌ను రివీల్ చేసినా లేదంటే ఆ రోజు నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో జాయిన్ అయినా కూడా అభిమానులకు చాలా పెద్ద న్యూస్ అనడంలో సందేహం లేదు. పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత బాలకృష్ణ కోలుకుని తిరిగి షూటింగ్ కు హాజరు కావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే సర్‌ప్రైజ్ ఏదైనా కూడా కచ్చితంగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయం. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో గతంలో వచ్చిన మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమాకు అంతకు మించి అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంతో బయ్యర్లు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారని సమాచారం అందుతోంది.
బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్..
ఇప్పటికే సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ జీ5 కొనుగోలు చేసింది. సినిమాపై ఉన్న నమ్మకంతో జీ5 భారీ మొత్తాన్ని నిర్మాతకు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి బాలకృష్ణ 111 మూవీ కొత్త నెంబర్స్‌ను చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు భగవంత్ కేసరి సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని హిట్ కాంబోతో ఈ హిట్ కాంబో జత చేరడంతో మరో సూపర్ హిట్ ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. క్రిస్మస్ కానుకగా టాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు లేవు, కానీ బాలీవుడ్ నుంచి పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అయినా కూడా NBK111 మేకర్స్ మాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్ కి కాకుండా సంక్రాంతికి విడుదల చేయాలని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ గోపీచంద్ మలినేని మాత్రం క్రిస్మస్ టార్గెట్ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడని టాక్.