సౌందర్యకు దక్కని రికార్డ్ నయనతారకి..!
ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్‌కి సౌత్ ఇండియాలో భారీ డిమాండ్ ఉండేది. సౌత్ ఇండియన్ మూవీస్‌లో నటించేందుకు ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ నటించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు.;
ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్‌కి సౌత్ ఇండియాలో భారీ డిమాండ్ ఉండేది. సౌత్ ఇండియన్ మూవీస్‌లో నటించేందుకు ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ నటించేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. ఒకవేళ సౌత్ సినిమాల్లో నటించినా అత్యధిక పారితోషికం డిమాండ్ చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. గత దశాబ్ద కాలంగా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించేందుకు గాను బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆసక్తి చూపుతున్నారు. కాస్త పారితోషికం తక్కువ అయినా పర్వాలేదు సౌత్ సినిమాల్లో చేసేద్దాం అనుకునే బాలీవుడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మరో వైపు సౌత్ హీరోయిన్స్‌కి బాలీవుడ్‌లో మంచి డిమాండ్ పెరిగింది. రష్మిక మందన్న సౌత్ ఇండియాలో టాప్ స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో ఈమె రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నయనతార బాలీవుడ్‌లో టాప్ పెయిడ్ హీరోయిన్ జాబితాలో చేరింది.
బాలీవుడ్‌లో నయనతారకి ఫుల్ డిమాండ్....
హీరోయిన్‌గా రష్మిక మందన్న తర్వాత సౌత్ నుంచి వరుస బాలీవుడ్ సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా నయనతార నిలిచింది. ఆమె హీరోయిన్‌గా ఇప్పటికే షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. జవాన్ తర్వాత బాలీవుడ్‌లో నయనతారకి ఫుల్ డిమాండ్ పెరిగింది. అయినా కూడా సౌత్‌లో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా హిందీ సినిమాలు ఒప్పుకోలేదు. ఎట్టకేలకు హిందీలో సినిమాను ఓకే చేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించబోతుంది. అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు, కానీ సల్మాన్ సినిమాలో నయనతార ఓకే అయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మీడియా సైతం ఈ విషయమై ప్రముఖంగా కథనాలు రాసింది. నయనతార పారితోషికం గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. జవాన్ సినిమాకి తీసుకున్న పారితోషికంతో పోల్చితే దాదాపుగా డబుల్ పారితోషికంను ఇప్పుడు నయన్ అందుకోబోతుంది అనేది ఆ వార్తల సారాంశం.
సల్మాన్ ఖాన్ మూవీలో హీరోయిన్‌గా...
నయనతార ఒకేసారి అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఒకేసారి అన్ని సౌత్ భాషల్లో సినిమాలు చేసిన హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సౌందర్య సౌత్ లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది. ఆమె హిందీలో కూడా సినిమాలు చేసింది. అయితే ఒకేసారి అన్ని భాషల్లో సినిమాలు చేయలేదు. సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు ఒకేసారి చేస్తూ, అదే సమయంలో హిందీలో కూడా సినిమా చేసిన ఘనత సౌందర్య దక్కించుకోలేక పోయింది. కానీ నయనతార మాత్రం ప్రస్తుతం సౌత్‌లో తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం సినిమాల్లో నటిస్తోంది. ఇదే సమయంలో హిందీ సినిమా కూడా కన్ఫర్మ్ అయింది. సాధారణంగా ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు చేసిన హీరోయిన్స్ ఉన్నారు, కానీ ఒకేసారి ఐదు భాషల్లో సినిమాలు చేస్తున్న ఘనత కేవలం నయన్‌కే సాధ్యం అయింది.
అత్యధిక పారితోషికం తీసుకుంటున్న...
హీరోయిన్‌గా సౌందర్య ఎన్నో అరుదైన రికార్డ్‌లను సొంతం చేసుకుంది, తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన సౌందర్య రికార్డ్‌ను నయనతార బ్రేక్ చేసిందని ఆమె అభిమానులు అంటున్నారు. హిందీలోనూ వరుస సినిమాలు చేయడం మాత్రమే కాకుండా, అత్యధిక పారితోషికం అందుకోవడం ద్వారా బాలీవుడ్ హీరోయిన్స్ ను సైతం నయనతార వెనక్కి నెట్టినట్లు అయిందని జాతీయ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్‌తో పోల్చితే నయనతార పారితోషికం అధికంగా ఉందని ఒక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఒకటి కథనం రాసింది. దీన్ని బట్టి నయన్ ఏ రేంజ్‌లో పారితోషికం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ తో సినిమా తర్వాత నయన్ మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు గాను ఆసక్తిగా ఉంది. పెళ్లి తర్వాత ఈ స్థాయిలో సినిమాలు చేస్తున్న సౌత్ హీరోయిన్‌గా నయనతార రికార్డ్‌ను సొంతం చేసుకుంది.