MRP నీకెంత నాకెంత.. మెలోడీతో బజ్ పెరిగినట్టు ఉందే..

టాలీవుడ్ యువ నటుడు నరేష్ అగస్త్య లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం MRP ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది.;

Update: 2026-05-07 04:50 GMT

టాలీవుడ్ యువ నటుడు నరేష్ అగస్త్య లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం MRP ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. 'నీకెంత.. నాకెంత' అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌ లైన్‌ తో రూపొందుతున్న ఆ చిత్రంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్, నటుడు సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఆ చిత్రానికి దర్శకుడు శ్రవణ్ జేష్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సీరియస్ పాయింట్‌ ను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌ గా సరికొత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేసినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ యూత్ ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, డబ్బు చుట్టూ తిరిగే సంబంధాలను ఫన్ అందిస్తూ.. స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలో బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ ఫేమ్ డోనాల్ బిష్ట్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఆ మూవీతో ఆమె టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం. నరేష్ అగస్త్యతో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంటుందని ఇప్పటికే విడుదలైన విజువల్స్ చూస్తే క్లియర్ గా తెలుస్తోంది. ఇద్దరూ కలిసి కనిపించిన సీన్స్ నేచరుల్ గా ఉండటంతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవుతున్నాయి.

తాజాగా సినిమా నుంచి ఒక్క మాటే అనే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఊరికూరికే ఇబ్బంది పెట్టకే.. ఊరి మధ్యలో పిచ్చోడిని చేయకే అంటూ సాగే ఆ పాట వినసొంపుగా ఉండటంతో మ్యూజిక్ లవర్స్‌ ను ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు అజయ్ అరసాడ అందించిన ట్యూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మెలోడీ ఫీల్‌ ను అందంగా క్యారీ చేసిన ఆయన కంపోజిషన్‌ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సింగర్ అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశారు. మరోసారి తన సింగింగ్ టాలెంట్‌ తో ఆకట్టుకున్నారు. అలాగే ప్రముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉండటంతో పాటు ఎమోషన్స్ ను ఎంతో అందంగా వ్యక్తపరుస్తోంది.

పాటలో కనిపించిన విజువల్స్ కూడా నేచురాలిటీకి దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నరేష్ అగస్త్య, డోనాల్ బిష్ట్ జంట స్క్రీన్‌ పై చాలా క్యూట్‌ గా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే టీజర్‌ ను బట్టి చూస్తే చిత్రం కేవలం కామెడీ మాత్రమే కాకుండా, సమాజంలో డబ్బు ప్రభావం, యువత కలలు, సంబంధాల మధ్య వచ్చే మార్పులను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

గతంలో విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అగస్త్య మరోసారి ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు వెన్నెల కిశోర్ తనదైన కామెడీ టైమింగ్‌ తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రవణ్ జేష్టా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తూ.. సినిమాతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఎం.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రూపొందుతున్న ఆ చిత్రం కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ కూడిన ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటకు వస్తున్న స్పందన రావడంతో సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది.



Full View


Tags:    

Similar News