ది ప్యారడైజ్ రెండో సాంగ్.. ఇంకాస్త గట్టిగా..

కానీ ‘ది ప్యారడైజ్’ రెండో పాట కోసం నాని టీమ్ మరో రూట్ తీసుకుంది. అనిరుధ్ డల్లాస్ కాన్సర్ట్‌లోనే ‘యేష నాగుల’ను రిలీజ్ చేసే ప్లాన్ చేశారు.

Update: 2026-08-29 04:43 GMT

సినిమా పాట రిలీజ్ అంటే హైదరాబాద్‌లో ఈవెంట్ పెట్టడం, యూట్యూబ్‌లో వీడియో వదలడం కామన్. కానీ ‘ది ప్యారడైజ్’ రెండో పాట కోసం నాని టీమ్ మరో రూట్ తీసుకుంది. అనిరుధ్ డల్లాస్ కాన్సర్ట్‌లోనే ‘యేష నాగుల’ను రిలీజ్ చేసే ప్లాన్ చేశారు. నాని కూడా అక్కడికి వెళ్లాడు. పైగా సినిమా థీమ్‌కు తగ్గ రెడ్, బ్లాక్ కాస్ట్యూమ్‌లో కనిపించాడు.

అనిరుధ్ కాన్సర్ట్‌కు వేల మంది వచ్చారు. వాళ్ల ముందే నాని కనిపించడం, అదే స్టేజ్‌పై ‘ది ప్యారడైజ్’ పాటను తీసుకురావడం వల్ల ఒక్కసారిగా సౌండ్ దద్దరిల్లింది. ఇలాంటి లైవ్ మూమెంట్స్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంటాయి. అందుకే సాంగ్ రిలీజ్‌ను ఒక మ్యూజిక్ ఈవెంట్‌తో కలిపినట్లు కనిపిస్తోంది.

‘యేష నాగుల’ పాట ఉంటుందని టాక్ వచ్చినప్పుడు జనాలు ఇది రూమర్ కాకూడదని పక్కా సాంగ్ ఉండాలని కోరుకున్నారు. ఇక మేకర్స్ అదే ఇవ్వడానికి ఫిక్స్ అయ్యారు అని తెలియగానే పాట రాక ముందే బజ్ పెరిగింది. ఇది తెలంగాణలో పాపులర్ అయిన ‘యేష నాగుల కట్ట మీద’ ఫోక్ నంబర్ ఆధారంగా వస్తోంది. కీర్తి సురేశ్ ఈ పాటలో నానితో కనిపించనుంది.

‘నేను లోకల్’, ‘దసరా’ తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒకే పాటలో కనిపించడం మరో స్పెషల్ పాయింట్. కాసర్ల శ్యామ్ సాహిత్యం రాయగా, అనిరుధ్ సంగీతం అందించాడు. పాట మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే ‘ఆయా షేర్’తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్ మొదలైంది. ఆ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇప్పుడు రెండో పాటకు అమెరికాలో లాంచ్ పెట్టడం చూస్తే, ప్రతి పాటను ఒకే పద్ధతిలో రిలీజ్ చేయకుండా వేర్వేరు ప్లాన్‌తో తీసుకెళ్తున్నారు అనిపిస్తోంది.

నాని కూడా సినిమా రిలీజ్‌కు ఇంకా నెల కూడా లేకముందే ఓవర్సీస్ ప్రమోషన్‌లో కనిపిస్తున్నాడు అంటే ఇక జడల్ హడావుడి మొదలైంది అనుకోవచ్చు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో ఉన్నారు. సినిమాను ఎనిమిది భాషల్లో రిలీజ్ చేయాలని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ డల్లాస్ మూమెంట్ తర్వాత ‘యేష నాగుల’ ఎంత దూరం వెళ్తుందన్నది చూడాలి.

Tags:    

Similar News