నాని బ్లడీ రోమియో.. ఇది అసలు మ్యాటర్
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో ఏదో తెలియని క్యూరియాసిటీ ఉంది.
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో ఏదో తెలియని క్యూరియాసిటీ ఉంది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ బ్లడీ రోమియో ఆగిపోయిందంటూ మధ్యలో రకరకాల రూమర్స్ వినిపించాయి. కానీ అదంతా వట్టిదేనని, ఈ సినిమా కోసం ఒక సాలిడ్ స్టఫ్ కుక్ అవుతోందని ఇన్ సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు మేకర్స్ సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ చేశారట.
ఇదే టైమ్ లో నాని స్వయంగా ఈ ప్రాజెక్ట్ గుట్టు విప్పాడు. సుజీత్ తో చేయబోయే సినిమాపై తనదైన స్టైల్ లో హింట్స్ ఇచ్చాడు. మన రెగ్యులర్ సినిమాల్లో చూసే ఎక్స్ట్రీమ్ వైలెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామాల్లా ఇది అస్సలు ఉండదని తేల్చేశాడు. థియేటర్లలో ఒక స్టైలిష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ కథను డిజైన్ చేశారని క్లారిటీ ఇచ్చాడు.
కథలో యాక్షన్ కు ఏమాత్రం లోటు ఉండదు కానీ, దానికి డైరెక్టర్ సుజీత్ తనదైన ఒక క్రేజీ ట్విస్ట్ యాడ్ చేశాడని నాని చెప్పుకొచ్చాడు. ఆ ట్విస్ట్ వల్లే యాక్షన్ తో పాటు డీసెంట్ ఫన్ చాలా బాగా వర్కౌట్ అవుతాయని చెప్పాడు. ఊరికే తుపాకులు పట్టుకుని కాల్చుకునే వాతావరణం కాకుండా కాస్త చమత్కారంగా సాగే సీన్స్ ఈ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్నాయట.
ఇందులో తన క్యారెక్టర్ ఒక గ్యాంగ్ స్టర్ షెఫ్ లా భిన్నంగా ఉండబోతోందని నాని రివీల్ చేశాడు. వంట మనిషి గ్యాంగ్ స్టర్ అవతారం ఎత్తడం లేదా మాఫియా డాన్ సరదాగా వంటలు చేయడం లాంటి కాన్సెప్ట్ తో సుజీత్ ఈ స్టోరీ రాసుకున్నాడని అర్థమవుతోంది. యాక్షన్ కలిపిన ఇలాంటి యూనిక్ జానర్ బహుశా ఇండియన్ స్క్రీన్ మీదే కొత్త అని నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
సుజీత్ విజన్, టేకింగ్ ఈ డిఫరెంట్ కథకు కరెక్ట్ గా సింక్ అయ్యాయని నాని ఫీల్ అవుతున్నాడు. వైలెన్స్ ను చాలా వెరైటీగా ప్రెజెంట్ చేస్తూనే, క్యారెక్టరైజేషన్ ను చాలా స్మార్ట్ గా, ఎంటర్టైనింగ్ గా మలచడం సుజీత్ స్టైల్. ఈ సినిమాలో కూడా అదే ఫార్ములాతో ఆడియన్స్ కు ఒక కొత్త ఫీల్ ఇవ్వబోతున్నారని నాని మాటల్ని బట్టి ఈజీగా గెస్ చేయొచ్చు.
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది ప్యారడైజ్' సినిమాలో నాని ఎంతో సీరియస్, డార్క్ అండ్ రస్టిక్ రోల్ లో కనిపించాడు. ఆ హెవీ ఎమోషనల్ యాక్షన్ మూవీ తర్వాత, దానికి పూర్తి కాంట్రాస్ట్ గా ఉండే ఈ లైట్ హార్టెడ్ స్టైలిష్ ఎంటర్టైనర్ రావడం థియేటర్లలో ప్రేక్షకులకు ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుందని నాని భావిస్తున్నాడు. డిఫరెంట్ జోనర్స్ ను బ్యాలెన్స్ చేస్తున్న ఈ షెఫ్ గ్యాంగ్ స్టార్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి