కింగ్ 100 గ్లింప్స్.. డబ్బు చుట్టూ నాగ్ కథ

ఈ ప్రాజెక్ట్‌కు కింగ్ 100 అనే టైటిల్‌ను ఫైనల్ చేస్తూ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.

Update: 2026-08-29 06:07 GMT

నాగార్జున 100వ సినిమా టైటిల్‌పై ఉన్న సస్పెన్స్‌కు మేకర్స్ తెరదించారు. ఈ ప్రాజెక్ట్‌కు కింగ్ 100 అనే టైటిల్‌ను ఫైనల్ చేస్తూ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. నిన్న వదిలిన చిన్న టీజ్‌లో కారును మాత్రమే చూపించిన చిత్ర యూనిట్, ఈరోజు వచ్చిన గ్లింప్స్‌లో సినిమా బేసిక్ థీమ్‌ను రివీల్ చేస్తూ నాగ్ పాత్రను పరిచయం చేసింది.

ప్రపంచంలో డబ్బున్న వాళ్లు, డబ్బు లేని వాళ్లు అంటూ రెండు రకాల మనుషులు ఉంటారని చెప్పే వాయిస్‌ఓవర్‌తో ఈ వీడియో మొదలైంది. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు, డబ్బు ఉన్నప్పుడు కింగ్ అంటున్నారు అని నాగార్జున చెప్పే డైలాగ్ తో కాన్సెప్ట్ పై క్లారిటీ ఇచ్చేశారు. కథ మొత్తం డబ్బు చుట్టూ, దాన్ని సంపాదించే క్రమంలో జరిగే పోరాటం చుట్టూ సాగుతుందని ఈ డైలాగ్స్ ద్వారా అర్థమవుతోంది.

ఇందులో నాగ్ లుక్ పూర్తిగా మాస్ టచ్‌తో రగ్గడ్‌గా డిజైన్ చేశారు. గ్లింప్స్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాగార్జున గుబురు గడ్డం, కళ్లజోడుతో సిగరెట్ తాగుతూ కనిపించాడు. పోస్టర్ మీద లాంగ్ లివ్ ది కింగ్ అనే క్యాప్షన్ కూడా హైలైట్ అవుతోంది. వీడియోలో చూపించిన షాట్స్ కూడా కథా నేపథ్యంపై క్లారిటీ ఇస్తున్నాయి.

చివర్లో నాగార్జున ఒక చిన్న బిడ్డను చేతుల్లో పట్టుకుని మంటల మధ్య నడుచుకుంటూ వచ్చే షాట్ తో ఎమోషనల్ యాంగిల్‌ కూడా ఉందని చెప్పేశారు. ఈ ప్రాజెక్టును అక్కినేని ఫ్యామిలీ నిర్మిస్తుండగా రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటింగ్, రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ, సతీష్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ వర్క్ అందిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ విజువల్స్‌కు సింక్ అయింది. గ్లింప్స్ వీడియో మాత్రమే కాకుండా సినిమా రిలీజ్ డేట్‌ను కూడా టీమ్ ముందుగానే ప్రకటించింది. డిసెంబర్ 24న కింగ్ 100 చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వీడియో చివర్లో క్లారిటీ ఇచ్చేశారు. మొదట సంక్రాంతి అని చెప్పినా మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.


Full View


Tags:    

Similar News