నాగబంధం రిలీజ్ డేట్.. ఆ మిస్టరీ రివీల్ అయ్యేది అప్పుడే!

సినీ పరిశ్రమలో ప్రస్తుతం మైథాలజీ ఫాంటసీ కథల ట్రెండ్ నడుస్తోంది. హనుమాన్, కాంతార వంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో మన పురాణాల్లోని అద్భుతాలను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.;

Update: 2026-03-26 07:08 GMT

సినీ పరిశ్రమలో ప్రస్తుతం మైథాలజీ ఫాంటసీ కథల ట్రెండ్ నడుస్తోంది. హనుమాన్, కాంతార వంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో మన పురాణాల్లోని అద్భుతాలను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అనౌన్స్‌మెంట్ నుండే హైప్ క్రియేట్ చేసిన సినిమా 'నాగబంధం'. అభిషేక్ నామ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం టీజర్ లోని విజువల్స్ తోనే హాట్ టాపిక్ గా మారింది. ఒక విభిన్నమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తోంది.




 


ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్ తో కూడిన కథలు వస్తున్నప్పటికీ, వాటిలో ఎమోషన్ ఉంటేనే జనాలు ఆదరిస్తున్నారు. 'నాగబంధం' టీజర్ లో చూపించిన ఎలిమెంట్స్ చూస్తుంటే ఇందులో కూడా ఒక బలమైన కథా వస్తువు ఉన్నట్లు అర్థమవుతోంది. విరాట్ కర్ణ తన రెండో సినిమాకే ఇలాంటి ఒక భారీ సబ్జెక్టును ఎంచుకోవడం విశేషం. శివుని అంశతో కూడిన యోధుడి పాత్రలో లుక్ చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తోంది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చాలా కాలంగా ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అని వేచి చూస్తున్న అభిమానులకు ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చింది. మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ క్రేజీ మైథాలజీ మూవీ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. విడుదల చేసిన పోస్టర్ లో హీరోకు, విలన్ కు మధ్య జరిగే పోరాటాన్ని చాలా ఎఫెక్టివ్ గా చూపించనున్నట్లు అర్ధమవుతుంది. చీకటికి వెలుగుకు మధ్య జరిగే ఈ యుద్ధం వెండితెరపై ఎలా ఉండబోతోందో అని ఆడియన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది.

పోస్టర్ లోని డిజైన్ గమనిస్తే, పురాతన ఆలయాలు, బంగారు విగ్రహాలు వంటివి కథలోని డెప్త్ ని చూపిస్తున్నాయి. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో స్పిరిచువల్ జర్నీ కూడా ప్రధానంగా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన 'నమో రే' సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. విదేశీ దండయాత్రల నేపథ్యంలో భారతీయ నిధులను కాపాడే క్రమంలో ఈ 'నాగబంధం' చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

ఈ సినిమా సక్సెస్ పై విరాట్ కర్ణ చాలా నమ్మకంగా ఉన్నాడు. తన బాడీ లాంగ్వేజ్ పై చేసిన వర్క్ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. టెక్నికల్ గా చూస్తే అశోక్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచేలా ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. భారీ సెట్టింగ్స్, అద్భుతమైన కెమెరా వర్క్ తో మేకర్స్ ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలని చూస్తున్నారు. రిలీజ్ డేట్ రావడంతో ఇక ప్రమోషన్స్ స్పీడ్ పెంచే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. మొత్తానికి వేసవి తర్వాత జూలైలో ఈ సినిమా రావడం బాక్సాఫీస్ దగ్గర మంచి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి పోటీ లేని సమయంలో సోలోగా రాగలిగితే వసూళ్ల పరంగా కూడా కలిసొస్తుంది.



Full View


Tags:    

Similar News